Jr NTR, Allu Arjun: బన్నీ, తారక్ కాంబోలో భారీ బడ్జెట్ మూవీ వచ్చే ఛాన్స్ ఉందా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బావా బావా అని పిలుచుకుంటూ చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, బన్నీ టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్లు కాగా గతంలో ఎన్టీఆర్, బన్నీ ఒకరి గురించి మరొకరు పాజిటివ్ గా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్, బన్నీ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాజమౌళి, సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకేశ్ కనగరాజ్, వెట్రిమారన్ లాంటి టాలెంటెడ్ దర్శకులు ప్రయత్నిస్తే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం కష్టం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్, బన్నీ కథల ఎంపికలో, దర్శకుల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఇద్దరు హీరోల పారితోషికం కూడా వేర్వేరుగా 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. బన్నీ, తారక్ దాదాపుగా ఒకే సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

తారక్ మాస్ సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టగా బన్నీ క్లాస్ సినిమాలపై ఎక్కువగా కెరీర్ తొలినాళ్లలో దృష్టి పెట్టారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈ ఇద్దరు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్ట్ లపై దృష్టి పెట్టడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలకు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

బన్నీ, ఎన్టీఆర్ లకు హిందీలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. బన్నీ, ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో మరెన్నో విజయాలను అందుకుని ఇండస్ట్రీని షేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్, బన్నీలకు రాబోయే రోజుల్లో మరిన్ని అవార్డులు సొంతం కావడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్, బన్నీ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్స్ లో నటించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus