Jr NTR, Balakrishna: నందమూరి అభిమానుల ముచ్చట ఆ సినిమా వల్ల తీరబోతుందట..!

బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య ఒకరకమైన కోల్డ్ వారు ఉంది అన్నది ఎప్పటినుండో ఇండస్ట్రీ టాక్. ఎందుకో బాలయ్య… ఎన్టీఆర్ ను దూరం పెడుతూ వస్తున్నాడు అని కూడా చాలా మంది చెబుతుంటారు. ఇది ఇప్పటి సంగతి కాదు..2002 లో వచ్చిన ‘ఆది’ ‘చెన్నకేశవ రెడ్డి’ ల టైం నాటిది. అయితే చాలా సార్లు వీటి పై ఎన్టీఆర్, బాలయ్య రియాక్ట్ అయ్యి అలాంటిది ఏమీ లేదు అని క్లారిటీ ఇస్తూ వచ్చారు. 2009 ఎన్నికల టైములో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి వీళ్ళు చాలా కృషి చేశారు.

‘అదుర్స్’ ‘సింహా’ ‘బృందావనం’ సినిమాల టైంలో వీళ్ళు చాలా అనోన్యంగా ఉన్న విజువల్స్ ను మనం చూసాం. ‘దాంతో వీరి కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందా?’ అని అటు నందమూరి అభిమానుల్లో.. ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే అనూహ్యంగా ‘దమ్ము’ సినిమా టైంలో మళ్ళీ బాలయ్యకి దూరమయ్యాడు ఎన్టీఆర్. కానీ హరికృష్ణ మరణం తర్వాత మళ్ళీ వీరు ఒకటయ్యారు. ‘అరవింద సమేత’ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘118’ సినిమాల వేడుకల్లో వీళ్ళు కలిసి సందడి చేశారు. కానీ ఈ మధ్య మళ్ళీ వీళ్ళు దూరంగా ఉంటున్నారనే అని టాక్ ఉంది.

ఇదిలా ఉండగా.. ఏది ఏమైతేనేం… వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఫ్రేమ్లో కనిపించబోతున్నారు అనేది తాజా సమాచారం. ఆహా వారికోసం బాలయ్య ‘అన్ స్టాపబుల్’ అనే టాక్ షోని హోస్ట్ చేస్తున్నాడు. దీనిని నిర్వహిస్తుంది మెగా ఫ్యామిలీ సభ్యులే అయినప్పటికీ.. మోహన్ బాబు వంటి వారిని కూడా గెస్ట్ లు గా అహ్వాహించారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ ను కూడా ఓ షోకి గెస్ట్ గా అహ్వాహించబోతున్నారని తాజా సమాచారం. కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ తో పాటు రాంచరణ్, రాజమౌళి కూడా హాజరవుతారట. ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో భాగంగా ఈ ఎపిసోడ్ ను నిర్వహించబోతున్నట్టు సమాచారం.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus