Kalki: మొత్తం స్నేహితుల్ని ‘కల్కి’ బాట పట్టిస్తున్న వైజయంతి మూవీస్‌!

దేశంలో తెరకెక్కుతున్న అతి పెద్ద సినిమాల జాబితాలో ‘కల్కి 2898 ఏడీ’ కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఇటీవల సినిమా రిలీజ్‌ కౌంట్‌ డౌన్‌ ప్రారంభించి మే9న విడుదల చేస్తామని డేట్‌ కూడా చెప్పేశారు. ఆ విషయం తర్వాత చూస్తే… ఇప్పుడు విషయం ఆ సినిమా భారీతనం గురించి. సినిమా బడ్జెట్‌ ఇంత అని టీమ్‌ ఇప్పటివరకు చెప్పలేదు కానీ… బడ్జెట్‌ అయితే ఏ ఇండియన్‌ సినిమా పెట్టనంత ఉంటుంది అంటున్నారు. అయితే ఇప్పుడు చర్చ కాస్టింగ్‌ గురించి.

‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఎవరు నటిస్తున్నారో ఇప్పటికే మీకు తెలుసు. ప్రభాస్‌, దీపిక పడుకొణె జంటగా నటిస్తున్న ఈ సినిమాను నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కిస్తున్నారు. అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే వీళ్లు మాత్రమే కాకుండా మరింతమంది యువ స్టార్‌ హీరోలను సినిమాలోకి తీసుకురావడానికి వైజయంతి మూవీస్‌ ప్రయత్నాలు చేస్తోందని గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. (Kalki) సినిమా విడుదల తేదీ దగ్గరకు వస్తుండేసరికి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి.

మొన్నటికి మొన్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ ఓ అతిథి పాత్రలో నటిస్తున్నాడు అనే వార్త బయటకు వచ్చింది. అయితే ఇప్పుడు మరో ఇద్దరి పేర్లు వచ్చాయి. వాళ్లే ఎన్టీఆర్‌, నాని. అన్నట్లు దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఉన్నాడంటున్నారు. మొత్తంగా ఈ పేర్లు అన్ని వింటుంటే కామన్‌గా వినిపించే అంశం ‘వైజయంతి మూవీస్‌’ నిర్మాతల స్నేహితులు. అశ్వనీదత్‌ కుమార్తెలు స్వప్న దత్‌, ప్రియాంక దత్‌కు పరిశ్రమలో చాలామంది నటులతో స్నేహ బంధం ఉంది. ఆ క్రమంలోనే యువ స్టార్లు నటిస్తారు అంటున్నారు.

పురాణాల పాత్రలకు సాంకేతికత మేళవించి ఈ సినిమా తెరకెక్కిస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రీ క్లైమాక్స్‌ సన్నివేశాల్లో పరశురాముడిగా ఎన్టీఆర్, కృపాచార్యుడిగా నాని కనిపిస్తారని సోషల్‌ మీడియా టాక్‌. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. సినిమా రిలీజ్‌కు మందు ఏమన్నా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. అన్నట్లు నటుడిగా కాకపోయినా సినిమాలో రానా కూడా ఓ పార్ట్‌ అని సమాచారం.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus