నిన్న రాత్రి నుంచి ఆర్ఆర్ఆర్ శాటిలైట్, డిజిటల్ హక్కులు 325 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని ఒక వార్త తెగ వైరల్ అవుతున్న సంగతి తెల్సిసిందే. గతంలో పెన్ స్టూడియోస్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేయగా ఆ సంస్థ నుంచి జీ స్టూడియోస్ ఆర్ఆర్ఆర్ శాటిలైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది. 325 కోట్ల రూపాయలకు ఆర్ఆర్ఆర్ హక్కులు అమ్ముడవడం ఫ్యాన్స్ కు సంతోషం కలిగిస్తున్నా మరో విధంగా వాళ్లకు నిరాశే ఎదురవుతోంది.
ప్రేక్షకులకు చాలా ఓటీటీలు అందుబాటులో ఉన్నప్పటికీ అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి పాపులర్ ఓటీటీలలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఈ ఓటీటీలకు ఎక్కువ సంఖ్యలో సబ్ స్క్రైబర్లు కూడా ఉండటం గమనార్హం. సబ్ స్క్రిప్షన్ ఉన్న ప్రేక్షకులు ఈ ఓటీటీలలో సినిమాలను ఉచితంగా చూసే అవకాశం ఉంటుంది. జీ నెట్ వర్క్ హిందీలో పాపులారిటీని సంపాదించుకున్నా తెలుగులో పెద్దగా ఆదరణ లేదు.
జీ నెట్ వర్క్ ఎక్కువగా పే పర్ వ్యూ పద్ధతిలో సినిమాలను రిలీజ్ చేస్తుంది. ఫలితంగా ఆర్ఆర్ఆర్ సినిమాను ఓటీటీలో కూడా డబ్బులు చెల్లించి చూడాల్సి ఉంటుంది. థియేటర్లలో రిలీజైన సినిమాలకు సైతం జీ నెట్ వర్క్ కొన్ని రోజులు డబ్బులు చెల్లిస్తే మాత్రమే చూసే అవకాశం కల్పిస్తుంది. ఫలితంగా సినిమాకు వ్యూస్ తగ్గుతాయని ఎన్టీఆర్, చరణ్ అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు రోజురోజుకు ఆర్ఆర్ఆర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతున్నాయి.