Jr NTR, Koratala Siva: తారక్‌ పాత్రను కొరటాల అలా రాస్తున్నారా!

తారక్‌ను అభిమానులు ముద్దుగా యంగ్‌ టైగర్‌ అని పిలుస్తుంటారు. నటన, డ్యాన్స్‌, ఫైట్స్‌… ఇలా అన్నింటా ఎన్టీఆర్‌ టైగర్‌లా దూకుడుగా ఉంటాడు. అందుకే అభిమానులు అలా పిలుచుకుంటూ ఉంటారు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్టీఆర్‌ చాలా రకాల పాత్రలు చేశారు. ముద్దుల ప్రేమికుడు, మంచి కొడుకు, తాతకు తగ్గ మననవడు, సగటు మనిషి, కుటుంబ పెద్ద… ఇలా ఎన్నెన్నో చేశాడు. అయితే వాటిలో ఎక్కడా ఎన్టీఆర్‌ హైపర్‌గా కనిపించడు. అయితే ఇప్పుడు ఆ ప్రయత్నం చేయబోతున్నట్లు సమాచారం.

కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ ఓ సినిమాలో నటిచబోతున్న విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా సంక్రాంతి తర్వాత పట్టాలెక్కుతుందని సమాచారం. అయితే ఈ సినిమాలో తారక్‌ పాత్ర గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. దాని ప్రకారం చూస్తే… ఈ సినిమాలో ఎన్టీఆర్‌ చాలా హైపర్‌గా, కోపిష్టిగా కనిపిస్తాడని సమాచారం. అయితే అతను అలా మారడానికి కీలకమైన కారణం ఉంటుందట. గతంలో ఎన్టీఆర్‌లో ఇలా ఓ సినిమాలో నటించినట్లు గుర్తు.

‘నాగ’లో యువ విద్యార్థి, రాజకీయ నాయకుడిగా కనిపించాడు ఎన్టీఆర్‌. ఆ సినిమాలో ఎన్టీఆర్‌ పాత్రకు చాలా దూకుడుగా ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్లకు మళ్లీ ఆ తరహా పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. అన్నట్లు ఈ సినిమా రాజకీయం – విద్యార్థులు కాన్సెప్ట్‌లోనే ఉంటుంది అంటున్నారు. ఈసారి తొలిసారి ఫలితం రాకుండా ఉంటే సరి. అంతకుమించి మనకేం కావాలి.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus