నందమూరి అభిమానులతో పాటు ఈ జనరేషన్ యూత్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. తారక్ సినిమాల గురించి, ఫ్యామిలీ, ముఖ్యంగా కిడ్స్ అభయ్ రామ్, భార్గవ్ రామ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా, పిక్ లేదా వీడియో కనిపించినా దాన్ని ఎంతలా వైరల్ చేస్తారో.. ట్రెండ్ చేస్తారో తెలిసిందే..80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి యంగ్ టైగర్ యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే..
అక్కడ క్షణం తీరిక లేకుండా ప్రమోషన్స్, ఇంటర్వూలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.. ఇంతకుముందు తారక్ లగ్జరీ లైఫ్ స్టైల్.. (ఇంటి దగ్గరి నుండి వాచెస్, కార్స్ అండ్ బైక్స్) వాటి విలువకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం..సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్, లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. గతంలోనూ పలుమార్లు ఎన్టీఆర్ టీషర్ట్,
స్వెట్‌షర్ట్, షూస్, మాస్క్ కాస్ట్ గురించి వంటి వాటి ధరల గురించిన వార్తలు వైరల్ అవడం చూశాం.. ఇప్పుడు తారక్ ధరించిన ఓ స్టైలిష్ హుడీ ప్రైజ్‌కి సంబంధించిన వార్తతో సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు ఫ్యాన్స్..తారక్ వైట్ కలర్‌లా కనిపిస్తున్న ఎసిడ్ క్లౌడ్ హుడీ వేసుకున్నాడు.. దీనిలో సింపుల్ అండ్ స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు.. ఇక ఫ్యాన్స్ ఆగుతారా.. వెంటనే సెర్చ్ చేసేశారు.. అన్నట్టు ఈ హుడీ కాస్ట్ ఎంతంటే.. రూ.19,500 అన్నమాట..
ఇక సినిమాల విషయానికొస్తే.. ఎట్టి పరిస్థితుల్లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్ పట్టుకు రావాల్సిందేనని జక్కన్న అండ్ టీం అక్కడ భీష్మించుకుని కూర్చున్నారు.. రావాలని ప్రపంచ నలుమూలలా ఉన్న తెలుగు వాళ్లు, మూవీ లవర్స్ కోరుకుంటున్నారు.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఫిబ్రవరిలో ప్టార్ట్ కానుంది..