Jr NTR, Rajamouli: ఎన్టీఆర్ గొప్పదనం అదేనంటున్న జక్కన్న.. ఏమైందంటే?

  • January 9, 2023 / 07:49 PM IST

తెలుగు సినిమా రంగంలో మరో మైలురాయిగా దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రికార్డులు, అవార్డుల వేటను కొనసాగిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఇంకా తన చరిష్మాను కొనసాగిస్తోంది. ఆస్కార్ బరిలో కూడా ఈ సినిమా నిలవగా.. ఇప్పుడు బాఫ్టా అవార్డులలో కూడా ఈ సినిమా పోటీ పడుతోంది. తాజాగా లాస్ ఏంజిల్స్ లో జరిగిన ప్రదర్శనకు తారక్, ఎన్టీఆర్ లు హాజరయ్యారు. ఆస్కార్ బరిలో నిలిచిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను తాజాగా లాస్ ఏంజిల్స్ లోని డీజీఏ థియేటర్ లో ప్రదర్శనకు జక్కన్న, తారక్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా తారక్ నటన గురించి జక్కన ప్రశంసల వర్షం కురిపించాడు. తారక్ నటన గురించి రాజమౌళి మాట్లాడుతూ.. ‘కొమురం భీముడో పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ సాంగ్ లో తారక్ అద్భుతంగా నటించాడు. నేను దర్శకత్వం వహించిన వాటిల్లో ఈ సీన్ నా ఆల్ టైం ఫేవరెట్. తారక్ కనుబొమ్మలపై మీరు కెమెరాను పెడితే వాటితోనూ అతడు హావభావాలను పలికించగలడు’ అని అన్నాడు. తారక్ నటన గురించి గతంలో కూడా చాలాసార్లు మెచ్చుకున్న జక్కన్న తాజాగా అంతర్జాతీయ వేదిక మీద మెచ్చుకున్నాడు.

తారక్ తెలుగు హీరో అని చెప్పుకోవడం ఎంతో గర్వంగా ఉందని చాలాసార్లు చెప్పిన రాజమౌళి.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బెస్ట్ యాక్టర్ తారక్ అని పొగడ్తల వర్షం కురిపించాడు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా 1200 కోట్ల వసూళ్లు రాబట్టగా.. ఇప్పటికే తన హవాను సాగిస్తోంది.

బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) నాన్ ఇంగ్లీష్ క్యాటగిరీ ఉత్తమ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పోటీ పడుతుండగా.. ఈ అవార్డులను జనవరి 19న ప్రకటించనున్నారు. ఫిబ్రవరి 19న అవార్డులను అందజేయనున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus