Jr NTR, Balakrishna: బాబాయ్ సినిమా ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్..!

నందమూరి బాలకృష్ణ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే ఒకే వేదికపై కనిపించబోతున్నారనే విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాలయ్య హోస్ట్ చేస్తోన్న ‘అన్‌స్టాపబుల్’ షోకి తారక్ గెస్ట్ గా వస్తారని మాటలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ షో కంటే ముందుగానే బాలకృష్ణ నటించిన ‘అఖండ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తున్నాడని సమాచారం. బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను తెరకెక్కిస్తోన్న ‘అఖండ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. డిసెంబర్ 2న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. దీంతో సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలు షురూ చేశారు. నవంబర్ 27న హైదరాబాద్ లో గ్రాండ్ గా ‘అఖండ’ ప్రీరిలీజ్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ వస్తాడని అంటున్నారు. గతంలో ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ సక్సెస్ మీట్ కి బాలయ్య బాబు అతిథిగా వచ్చారు.

ఆ తరువాత ఎన్టీఆర్ బయోపిక్ ఈవెంట్ కి ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా వచ్చాడు. ఇప్పుడు మరోసారి బాలయ్య-ఎన్టీఆర్ లు ఒకే వేదికపై కనిపించడానికి సిద్ధమవుతున్నారు.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus