యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లను అందుకున్నారు. తారక్ సినీ కెరీర్ లో సింహాద్రి (Simhadri) సినిమా ఒకింత ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించింది. అయితే సింహాద్రి సినిమా తర్వాత తారక్ నటించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకోలేదు. అయితే సింహాద్రి సినిమా తర్వాత నటించిన సినిమాల ఫలితాల విషయంలో బాధ పడ్డానని ఆ నాలుగేళ్లు నరకం చూశానని తారక్ పేర్కొన్నారు.
ఆ తర్వాత యమదొంగ (Yamadonga) సినిమాతో భారీ సక్సెస్ దక్కిందని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. రాఖీ (Rakhi) సినిమా నటుడిగా మంచి పేరును తెచ్చిపెట్టినా ఆ సినిమా కమర్షియల్ గా ఆశించిన రేంజ్ లో హిట్ కాలేదని జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. బృందావనం సినిమా తర్వాత కూడా తారక్ కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే టెంపర్ (Temper) సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన తారక్ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే రాలేదనే సంగతి తెలిసిందే. టెంపర్, నాన్నకు ప్రేమతో(N(Janatha Garage) , జనతా గ్యారేజ్(Janatha Garage), జై లవకుశ (Jai Lava Kusha) , అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava), ఆర్.ఆర్.ఆర్ (RRR) సినిమాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయనే సంగతి తెలిసిందే.
సినిమా సినిమాకు అంతకంతకూ ఎదుగుతున్న తారక్ దేవర సినిమాతో ఇప్పటికే 150 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తారక్ కెరీర్ ప్లాన్ మాత్రం బాగుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.