Jr NTR: మల్టీస్టారర్ విషయంలో ఎన్టీఆర్ ఛాయిస్ ఆ హీరోనేనా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా చాలామంది స్టార్ హీరోలతో మల్టీస్టారర్ సినిమాలు చేయాలని కథ నచ్చితే మల్టీస్టారర్లకు సిద్ధమేనని వెల్లడించారు. అయితే చాలా సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ కు ఏ హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఉందని ప్రశ్న ఎదురు కాగా జూనియర్ ఎన్టీఆర్ ఆ ప్రశ్న గురించి స్పందిస్తూ మహేష్ బాబు పేరును సమాధానంగా చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు దాదాపుగా ఒకే సమయంలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా ఈ ఇద్దరు హీరోలకు ఒకే సమయంలో స్టార్ స్టేటస్ దక్కింది.

మహేష్ క్లాస్, మాస్ ప్రేక్షకులను అలరించే సినిమాలపై దృష్టి పెట్టగా తారక్ కెరీర్ తొలినాళ్లలో మాస్ ప్రేక్షకులకు నచ్చే సినిమాలపై ఎక్కువగా దృష్టి పెట్టడం గమనార్హం. సరైన కథ దొరికితే ఈ కాంబినేషన్ లో సినిమా రావడం గ్యారంటీ అని చెప్పవచ్చు. స్టార్ డైరెక్టర్లలో ఎవరైనా ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు వేస్తారేమో చూడాల్సి ఉంది. మహేష్, జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.

సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను సొంతం చేసుకున్నాయి. ఎన్టీఆర్, చరణ్ కాంబోలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించింది. తారక్, మహేష్ కాంబినేషన్ లో సినిమా వస్తే ఆర్ఆర్ఆర్ సినిమాను మించి రికార్డులు క్రియేట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. రాజమౌళి ఈ కాంబినేషన్ లో సినిమా దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ సైతం భావిస్తున్నారు.

అటు జూనియర్ ఎన్టీఆర్ ఇటు మహేష్ బాబు వరుస విజయాలతో జోరుమీదున్నారు. ఈ హీరోలు తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus