ఏపీలో 2024 ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని స్పష్టత రావడంతో వచ్చే ఏడాది ఇదే సమయంలో ఎన్నికలు జరగనున్నాయని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం చేస్తారా? లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతుండగా మరోవైపు సీఎం ఎన్టీఆర్ సీఎం ఎన్టీఆర్ అనే స్లోగన్స్ పలు చోట్ల హాట్ టాపిక్ అవుతున్నాయి. మరోవైపు 2024 ఎన్నికల ప్రచారంలో టీడీపీ తరపున ఎన్టీఆర్ పాల్గొనే అవకాశం ఉందని కొంతమంది టీడీపీ నేతలు కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.
అయితే వరుస సినిమాలతో బిజీగా ఉన్న తారక్ ప్రస్తుతం రాజకీయ ప్రచారంపై దృష్టి పెట్టే అవకాశాలు అయితే కనిపించడం లేదు. 2024 డిసెంబర్ నాటికి మూడు సినిమాల షూటింగ్ లను పూర్తి చేయాలని జూనియర్ ఎన్టీఆర్ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ మూడు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమాలకు 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి.
అయితే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ను ప్రచారం చేయాలని టీడీపీ ముఖ్యులు కోరితే మాత్రం పరోక్షంగా తారక్ ప్రచారం చేసే ఛాన్స్ ఉంది. మరోవైపు ఎన్టీఆర్30 మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది అక్టోబర్ సమయానికి ఈ మూవీ షూటింగ్ పూర్తి కానుంది. అండర్ వాటర్ లో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను షూట్ చేస్తారని ఆ సన్నివేశాలు సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం.
త్వరలో జాన్వీ కపూర్ ఈ సినిమా షూట్ లో పాల్గొననున్నారని తెలుస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్ షూట్ జరిగిందని సమాచారం. తారక్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని నెగిటివ్ సెంటిమెంట్లను ఈ సినిమా కచ్చితంగా బ్రేక్ చేస్తుందని భావిస్తున్నారని తెలుస్తోంది.