Jr NTR: వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్!

  • January 18, 2022 / 06:08 PM IST

తన నటనతో ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు గుర్తింపును తెచ్చిపెట్టిన నటులలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి. ప్రతిభ ఉన్న ఎంతోమంది నటులను సీనియర్ ఎన్టీఆర్ ప్రోత్సహించారు. తక్కువ మొత్తంలో పారితోషికం తీసుకోవడంతో పాటు సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలను ఆదుకునే విషయంలో ఎన్టీఆర్ ముందుండేవారు.

సినీ కెరీర్ లో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించి ఎన్టీఆర్ విజయాలను సొంతం చేసుకున్నారు. నేడు సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. తెలుగు ప్రజల గుండెల్లో నాటికీ నేటికీ ముమ్మాటికీ ధ్రువతార మీరే అంటూ జూనియర్ ఎన్టీఆర్ పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ చేసిన పోస్ట్ కు రికార్డు స్థాయిలో లైక్స్, షేర్స్ వస్తున్నాయి.

తాత అంటే జూనియర్ ఎన్టీఆర్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా షూటింగ్ పనులు త్వరలో మొదలు కానున్నాయని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు జోడీగా అలియా భట్, రష్మిక మందన్నా పేర్లు వినిపిస్తుండగా రష్మిక మందన్నా ఈ సినిమాలో ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రివేంజ్ డ్రామాగా తెరకెక్కనుంది.

కొరటాల శివ సినిమాలో అంతర్లీనంగా మెసేజ్ ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. కొరటాల శివ ఇప్పటికే తారక్ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులను పూర్తి చేశారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా మేకర్స్ త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను వెల్లడించనున్నారని సమాచారం. ఎన్టీఆర్ సైతం సినిమాల విషయంలో వేగం పెంచాలని అనుకుంటున్నారు. తారక్ ఒకే సమయంలో కొరటాల శివ, ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో నటించే అవకాశాలు ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus