Jr NTR: పునీత్ రాజ్ కుమార్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్..!

స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ ప్రధమ వర్థంతి సందర్భంగా.. గౌరవార్థం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారాన్ని ప్రధానం చెయ్యడానికి ‘కర్ణాటక రాజ్యోత్సవ’ కార్యక్రమాన్ని అంగరంగవైభవంగా ఏర్పాటు చేసింది కర్ణాటక ప్రభుత్వం.. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీ కాంత్, ఇన్ఫోసిస్ ఛైర్ పర్సన్ సుధా మూర్తి, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌లను ముఖ్య అతిథులుగా కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. పునీత్ కుటుంబ సభ్యులు, కన్నడ ప్రజలు, పునీత్ అభిమానులు, బెంగుళూరులో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హాజరయ్యారు..

కార్యక్రమం ప్రారంభమవగానే.. వరుణుడు కూడా పునీత్ మీద ప్రేమ కురిపిస్తున్నాడు అన్నట్లు వర్షం స్టార్ట్ అయ్యింది. జోరువానలో గొడుగు పట్టినా పట్టించుకోకుండా తన అన్న పునీత్ గురించి ఎన్టీఆర్ ఎమోషనల్‌గా మాట్లాడాడు.. తారక్ ప్రసంగిస్తున్నంత సేపు అభిమానులు హర్షద్వానాలు చేస్తూనే ఉన్నారు. రజినీ కాంత్, పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్‌తో పాటు అతిథులంతా శ్రద్ధగా విన్నారు.. తారక్ స్పీచ్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది..తల్లి కర్ణాటకలోని కుందాపూర్‌కి చెందిన వ్యక్తి కావడంతో తారక్‌కి చిన్నప్పటినుండే కన్నడ తెలుసు..

పునీత్ ‘చక్రవ్యూహ’ సినిమాలో ‘గెలయా గెలయా’ పాట పాడే వరకు ఈ విషయం పెద్దగా ఎవరికీ తెలియదు.. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కన్నడలోనే తన ప్రసంగాన్ని కొనసాగించాడు. కర్ణాటక ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కన్నడ ప్రజలకు ‘కర్ణాటక రాజ్యోత్సవ’ శుభాకంక్షలు తెలియజేస్తూ స్పీచ్ స్టార్ట్ చేసిన తారక్.. ‘‘జీవితంలో ఒక మనిషి వ్యక్తిత్వం అనేది అది అతని సొంత సంపాదన..

ఎటువంటి కల్లాకపటం, స్వార్థం తెలియని మనిషి, ప్రజల హృదయాలను గెలుచుకున్న రాజు పునీత్ రాజ్ కుమార్.. కర్ణాటకలో బ్యూటిఫుల్ సూపర్ స్టార్, గొప్ప కొడుకు, గొప్ప తండ్రి, గొప్ప ఫ్రెండ్.. గ్రేట్ యాక్టర్, డ్యాన్సర్, సింగర్.. వీటన్నిటికి మించి గొప్ప మానవతావాది.. నా ఉద్దేశంలో కర్ణాటక రత్న అంటే అర్థమే శ్రీ పునీత్ రాజ్ కుమార్’’ అంటూ తారక్ ఎమోషనల్‌గా ఇచ్చిన స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంటోంది..

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus