Jr NTR: ఈ సైలెన్స్ ను బ్రేక్ చేయొచ్చుగా ఎన్టీఆర్!

  • February 26, 2022 / 10:36 AM IST

స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ రోల్ లో చరణ్ తో కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ రిలీజ్ కావడానికి మరో నాలుగు వారాల సమయం మాత్రమే ఉంది. ఈ నెల 25వ తేదీన భీమ్లా నాయక్ సక్సెస్ తో అభిమానులు సంతోషంలో ఉండగా వచ్చే నెల 25వ తేదీన ఆర్ఆర్ఆర్ భారీ అంచనాలతో రికార్డు స్థాయిలో థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే తారక్ కొత్త సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు.

Click Here To Watch

ఇతర స్టార్ హీరోలు ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలలో నటిస్తూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటుంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మనస్సులో ఏముందో ఏముందో అభిమానులకు అర్థం చేయడం లేదు. తారక్ ప్రవర్తనతో అభిమానులు కలత చెందుతున్నారు. అరవింద సమేత వీర రాఘవ తర్వాత తారక్ నటించిన మరో సినిమా థియేటర్లలో రిలీజ్ కాలేదు. గతేడాది ఎవరు మీలో కోటీశ్వరులు షోకు తారక్ హోస్ట్ గా వ్యవహరించారు.

అయితే ఎవరు మీలో కోటీశ్వరులు షో బుల్లితెరపై ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఈ షో తర్వాత సీజన్లకు తారక్ హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు దాదాపుగా లేవని సమాచారం. ఆర్ఆర్ఆర్ లో మరో హీరోగా నటించిన చరణ్ వరుసగా సినిమాలతో బిజీగా ఉంటే ఎన్టీఆర్ మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఎన్టీఆర్30 షూటింగ్ గురించి అభిమానులకు ఎలాంటి క్లారిటీ రావడం లేదు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రివేంజ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా గురించి తారక్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

తారక్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఒక సినిమాలో బుచ్చిబాబు డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ గురించి కూడా అతి త్వరలో క్లారిటీ రానుంది. ఎన్టీఆర్ వేగంగా సినిమాలను పూర్తి చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తారక్ సైలెన్స్ ను బ్రేక్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

భీమ్లా నాయక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ తో పాటు పవన్ హీరోగా రీమేక్ అయిన 12 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus