ఈ సినిమాతో 20ఏళ్ల వయసులోనే ఎన్టీఆర్ స్టార్ హీరో అయ్యాడు

సోషల్ మీడియా వేదికగా నేడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సత్తా చాటుతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా ఉన్న సింహాద్రి మూవీ 17ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వారు పండుగ చేసుకుంటున్నారు. నిన్న సాయంత్రం నుండే సోషల్ మీడియాలో సింహాద్రి 17 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ వాళ్ళు ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. ఇక ట్వీట్స్ మరియు రీట్వీట్స్ ద్వారా ఓ పెద్ద రికార్డు క్రియేట్ చేయాలని వారు శ్రమిస్తున్నారు.

ఇక వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జాయినై సింహాద్రి 17 ఏళ్ళు పూర్తి చేసుకున్న వేడుకను జరుపుకుంటున్నారు. మరి సాయంత్రం లోపు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. రాజమౌళి రెండవ చిత్రంగా వచ్చిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అందుకొంది. సింహాద్రి మూవీ ఎన్టీఆర్ కి హీరోగా 7వ చిత్రం. తన ఏడవ చిత్రంతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్. అప్పటికి ఎన్టీఆర్ వయసు కేవలం 20ఏళ్ళు కావడం మరో విశేషం.

అంత చిన్న వయసులోనే ఓ బ్లాక్ బస్టర్, మరో ఇండస్ట్రీ హిట్ మరియు ఓ హిట్ మూవీతో ఎన్టీఆర్ స్టార్ హీరోల సరసన చేరిపోయారు. ఇక ఎన్టీఆర్ కి భారీ మాస్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రంగా సింహాద్రి నిలిచిపోయింది. అనేక టాలీవుడ్ రికార్డ్స్ తుడిచివేసిన సింహాద్రి ఎన్టీఆర్ కెరీర్ లోనే భారీ హిట్ అందుకున్న చిత్రంగా ఉంది. ఎన్టీఆర్ నుండి ఆ స్థాయి విజయం అందుకున్న మరో చిత్రం ఇంత వరకు రాలేదు. మరి ఆర్ ఆర్ ఆర్ తో రాజమౌళి సాకారం చేస్తారేమో చూడాలి.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus