Jr NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాత్రమే ఇది సాధ్యమా.. ఏం చేశారంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈ నెల 23వ తేదీన ఎన్టీఆర్30 ఓపెనింగ్ జరగనుంది. జాన్వీ కపూర్ సైతం ఎన్టీఆర్ తో కలిసి నటించడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పని హాట్ టాపిక్ అవుతోంది. హాలీవుడ్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎయిర్ ప్లేన్ బ్యానర్ ను ఎగురవేశారు.

“థాంక్యూ ఎన్టీఆర్.. ఎన్టీఆర్30 కోసం వేచి ఉండలేకపోతున్నాం” అంటూ ఇంగ్లీష్ లో రాసిన బ్యానర్ ను ఎయిర్ జెట్ ద్వారా ఎగురవేయడంతో ఫ్యాన్స్ వార్తల్లో నిలిచారు. ఎన్టీఅర్30 కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా నెక్స్ట్ లెవెల్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ కోసం కొరటాల శివ ఏకంగా ఆరు నెలలు కష్టపడ్డారని తెలుస్తోంది. ఈసారి ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ కావాలని కొరటాల ఫిక్స్ అయ్యారని సమాచారం.

ఎన్టీఆర్30 గెస్ట్ లకు సంబంధించి వేర్వేరు పేర్లు వినిపిస్తుండగా మరికొన్ని గంటల్లో గెస్ట్ లకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. ఎన్టీఆర్30 కనీసం 1000 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ జాన్వీ కాంబినేషన్ వేరే లెవెల్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో జాన్వీ బిజీ కావడం గ్యారంటీ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్30 తారక్, కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ అయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ తో పాటు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. ఎన్టీఆర్30 బడ్జెట్ 300 కోట్ల రూపాయలు కాగా ఈ సినిమాకు భారీ రేంజ్ లో బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్30 ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నెగిటివ్ సెంటిమెంట్లను ఈ సినిమా బ్రేక్ చేస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus