ఎన్టీఆర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ కి 18ఏళ్ళు

నందమూరి తారక రామారావు షార్ట్ గా ఎన్టీఆర్. తాతగారు ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్న తారక్ స్టార్ హీరోగా ఎదిగి ఆయన వారసత్వాన్ని నిలబెట్టాడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాల తక్కువ వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన మొదటి చిత్రం నిన్ను చూడాలని 2001లో రామోజీ రావ్ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ లో తెరకెక్కింది. ఐతే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించలేదు.

రెండో చిత్రం రాజమౌళి దర్శకత్వలో వచ్చిన స్టూడెంట్ నంబర్ వన్ సూపర్ హిట్ సాధించింది. హీరోగా ఎన్టీఆర్ ఈ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తదుపరి మూడవ చిత్రంగా సుబ్బు విడుదల కాగా అది మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఐతే ఎన్టీఆర్ భారీ స్టార్ డమ్ తెచ్చిన చిత్రం ఆది. మాస్ డైరెక్టర్ వి వి వినాయక్ ఈ చిత్రాన్ని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించాడు.

వినాయక్ కి అది ఫస్ట్ మూవీ కాగా ఎన్టీఆర్ కి నాలుగవ చిత్రం. ఎన్టీఆర్ కెరీర్ లో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఆది అతనికి విపరీతమైన ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఆ మూవీ విజయం తరువాత ఎన్టీఆర్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పుడు ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ కొనసాగుతుండగా వి వి వినాయక్ కుర్ర హీరో తారక్ తో మూవీ తీసి భారీ హిట్ అందుకున్నారు. ఎన్టీఆర్ కి మొదటి బ్లాక్ బస్టర్ వచ్చే నాటికి కేవలం వయసు 19 ఏళ్లే. అమ్మతోడు అడ్డంగా నరికేస్తా, ఈ సీమలో మొదట కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత, వంటి డైలాగ్స్ జనాల్లో చానళ్ళు నలిగాయి. ఈ చిత్రం విడుదలైన సరిగ్గా నేటికి 18ఏళ్ళు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus