ఎన్టీఆర్ (Jr NTR) క్విక్ లెర్నర్ అని చాలా మంది చెబుతుంటారు. దేనినైనా ఇట్టే పెట్టేస్తాడు. వెంటనే చేసేస్తాడు అని రాజమౌళి వంటి అగ్ర దర్శకులు ఎంతో మంది చెబుతూ ఉంటారు. ఎవరైనా ఒక రోజులో రెండు రకాల పనులు చేయడానికే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక రోజులో పది రకాల పనులైనా ఎంతో ఈజ్ తో చేసేస్తాడు అని అతని సన్నిహితులు చెబుతూ ఉంటారు. అది నిజమే అని నిన్న ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా సక్సెస్ ఈవెంట్ చూస్తే ఎవ్వరికైనా ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
ఎందుకంటే నిన్న ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచ్ లో చాలా వరకు సోషల్ మీడియాలో డిస్కస్ చేసుకున్న అంశాలే ఉన్నాయి. ముఖ్యంగా అతని బావమరిది నార్నె నితిన్ (Narne Nithin) విషయానికి వద్దాం. ఎన్టీఆర్ సపోర్ట్ వల్లే అతను హీరో అయ్యాడు అని అంతా అనుకుంటున్నారు. ‘కానీ నీ చావు నువ్వు చావు నా సపోర్ట్ అయితే ఉండదు’ అని చెప్పినట్టు ఎన్టీఆర్ కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ఎన్టీఆర్ ఎంతలా ఈ కవర్ డ్రైవ్ చేసినా.. అది అందరూ అంగీకరించడం కష్టం.
మరో విషయానికి వస్తే.. నాగవంశీ (Suryadevara Naga Vamsi) గురించి, అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసే విధానం గురించి అందరికీ తెలుసు. దీనిపై కూడా ఎన్టీఆర్ స్పందించాడు. సోషల్ మీడియాలో నాగవంశీని చింటూ అని పిలుస్తుంటారు. ‘మా చింటూ నాగవంశీ చాలా మంచోడు. మాట కరుకు. కానీ మనిషి చాలా మంచోడు. సినిమా అంటే అతనికి పిచ్చి’ అంటూ నాగవంశీపై వస్తున్న ట్రోలింగ్ గురించి కూడా స్పందించి క్లారిటీ ఇచ్చాడు ఎన్టీఆర్.
అలాగే నాగవంశీ నిర్మాణంలో ఒక సినిమా(నెల్సన్ తో) (Nelson Dilip Kumar) చేస్తున్నట్టు కూడా క్లారిటీ ఇచ్చాడు. దాని అప్డేట్స్ విషయంలో కూడా నువ్వే టార్చర్ అనుభవించాలి అంటూ ఎన్టీఆర్ పలికాడు. ఇక ‘దేవర 2’ ఉండదు అని చాలా డిస్కషన్లు నడిచాయి. ఆ రూమర్స్ ని కూడా కొట్టిపారేసి ‘దేవర 2’ ఉంటుందని ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది.సో ఎన్టీఆర్ సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతాడు అని ఈ అంశాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.