యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ సైఫ్ అలీ ఖాన్ కు యాక్సిడెంట్ కావడం వల్ల తాత్కాలికంగా వాయిదా పడింది. అనిరుధ్ కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ మారడానికి మరో కారణమని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే జూనియర్ ఎన్టీఆర్ పీరియాడికల్ ఫిల్మ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం అందుతోంది. టాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో గుర్తింపును సొంతం చేసుకున్న రాహుల్ సాంకృత్యాన్ ఎన్టీఆర్ కు కథ వినిపించగా పీరియాడికల్ ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.
త్వరలో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ లేదా రాహుల్ సాంకృత్యాన్ ఈ ప్రాజెక్ట్ గురించి స్పందించి పూర్తిస్థాయిలో స్పష్టత ఇవ్వాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కెరీర్ బెస్ట్ హిట్లు సొంతం చేసుకోవాలని ఫీలవుతున్నారు. కథల ఎంపిక విషయంలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా జూనియర్ ఎన్టీఆర్ అడుగులు పడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కెరీర్ బెస్ట్ హిట్లు దక్కుతాయో లేదో తెలియాల్సి ఉంది.
తారక్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. తారక్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను పూర్తి చేసి తర్వాత సినిమాలతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ 100 నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. బాలీవుడ్ ప్రముఖ బ్యానర్లు ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించడానికి ఆసక్తి చూపిస్తున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) సోషల్ మీడియాలో కూడా క్రేజ్ ను పెంచుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో మరింత క్రేజ్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తారక్ భవిష్యత్తులో పౌరాణిక పాత్రల్లో సైతం నటించాలని అభిమానులు భావిస్తున్నారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!