ఆర్ఆర్ఆర్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన తర్వాత తారక్ కు పాన్ ఇండియా హీరోగా గుర్తింపు వచ్చిందనే సంగతి తెలిసిందే. తారక్ తర్వాత సినిమాలపై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే వేర్వేరు కారణాల వల్ల తారక్ కొరటాల శివ కాంబో మూవీ ఆలస్యమవుతోంది. అయితే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షోల్డర్ సమస్యతో బాధ పడుతున్నారని సమాచారం అందుతోంది. కొన్నిరోజుల క్రితం జరిగిన బింబిసార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ హాజరు కాగా అప్పటికే తారక్ ను ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోందని తెలుస్తోంది.
నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని తారక్ కు వైద్యులు సూచనలు చేశారని బోగట్టా. మరోవైపు కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ పనులను ఇంకా పూర్తి చేయలేదని తెలుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరగా ఆరోగ్య సమస్య నుంచి కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ ఈ సినిమా కోసం బరువు తగ్గాల్సి ఉంది.
ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూట్ ఆలస్యమైనా పరవాలేదని అయితే ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు తారక్ కు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తారక్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించనున్నారు.
ఈ సినిమాతో తారక్ కెరీర్ లో మరో పాన్ ఇండియా హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తుండగా తారక్ కొరటాల కాంబో మూవీ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
Most Recommended Video
సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?