Jr NTR: రూ.25 లక్షల కోసం ఇబ్బంది పెడితే.. ఎన్టీఆర్ ఆదుకున్నాడట..!

ఎన్టీఆర్ గురించి కానీ అతని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కానీ ఎంత చెప్పినా తక్కువే..! ‘ఆర్.ఆర్.ఆర్’ తో అయితే అతను పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఆ సినిమాలో ఆయన పోషించిన కొమరం భీమ్ పాత్రకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆస్కార్ బరిలో కూడా ఎన్టీఆర్ నిలుస్తాడు అంటూ పలు సర్వేలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఇండస్ట్రీలో అందరూ ఎన్టీఆర్ ను ఆల్ రౌండర్ అంటుంటారు. టాలీవుడ్లో ఎన్టీఆర్ వంటి గొప్ప నటుడు ఉండడం మన అదృష్టం అంటూ సీనియర్ స్టార్ నటుడు కోటా శ్రీనివాసరావు వంటి వారు కూడా గర్వంగా చెప్పారు.

ఎందుకంటే ఎన్టీఆర్ అద్భుతంగా డాన్స్ చేయగలడు, గుక్క తిప్పుకోకుండా డైలాగులు చెప్పగలడు, పాటలు పాడగలడు, డాన్స్ లు అద్భుతంగా చేయగలడు, ఫైట్ లు కూడా బాగా చేస్తాడు.. ఇలా చెప్పుకోవాలి అంటే చాలా ఉన్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం కోసం అతను 5,6 భాషలు నేర్చుకున్నాడు. తెలుగుతో పాటు ఇంకా కొన్ని వెర్షన్స్ కి అతనే ఓన్ గా డబ్బింగ్ చెప్పుకున్నాడు. తారక్ క్రికెట్ కూడా చాలా బాగా ఆడతాడు. ‘బిగ్ బాస్’ ‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ వంటి షోలకు హోస్ట్ గా కూడా చేసి బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించాడు ఎన్టీఆర్.

అన్నిటికీ మించి గ్రేట్ హ్యూమన్ అని కూడా చాలా మంది చెబుతుంటారు. తనకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులను కూడా ఎన్టీఆర్ చాలా బాగా ట్రీట్ చేస్తాడట.ఇందుకు తాజాగా మరో ఉదాహరణని చెప్పుకొచ్చాడు ‘జబర్దస్త్’ కమెడియన్ ధనరాజ్. ‘బిగ్ బాస్ సీజన్ 1’ ను ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న టైంలో కంటెస్టెంట్ సంపూర్ణేష్ బాబు హౌస్ లో ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు.ఆ సీజన్ లో ధనరాజ్ కూడా ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఇక ‘మధ్యలోనే తనని పంపించేయమని’ ఆ సీజన్లో సంపూ చాలా రచ్చ చేశాడు.

అతన్ని హౌస్ లో నుండి బయటకు పంపడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పుకోలేదట. మధ్యలో బయటకు వెళ్ళాలి అనుకుంటే రూ.25 లక్షలు ఫైన్ కట్టి వెళ్లాలని సంపూని ఇబ్బంది పెట్టారట. అప్పుడు ఎన్టీఆర్ కల్పించుకుని.. ‘సంపూ మానసిక పరిస్థితి ఏమీ బాలేదు. అతన్ని హౌస్ నుండి పంపించండి. నేను హోస్ట్ గా చేస్తున్న మొదటి షో లో ఇలా చేయొద్దు. కావాలంటే ఆ రూ.25 లక్షలు నేను కడతాను’ అని యాజమాన్యానికి నచ్చ చెప్పి సంపూ కోసం చాలా ఫైట్ చేసాడట ఎన్టీఆర్. అందుకే సంపూని హౌస్ నుండి తొందరగా బయటకు పంపారు బిగ్ బాస్ వాళ్ళు.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus