Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు హరికృష్ణ పెట్టిన పేరు ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పాన్ ఇండియా హీరోలుగా గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలై మూడు నెలలు దాటినా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా, వెబ్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ అప్డేట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తండ్రి హరికృష్ణ పెట్టిన పేరు ఏమిటి? అనే ప్రశ్నకు తారక్ అభిమానుల్లో కూడా చాలామందికి సమాధానం తెలియదు.

సీనియర్ ఎన్టీఆర్ కొడుకుల పేర్లలో కృష్ణ ఉండగా హరికృష్ణ మాత్రం తన కొడుకుల పేర్లలో రామ్ ఉండేలా చూసుకున్నారు. హరికృష్ణ తన కొడుకులకు జానకి రామ్, కళ్యాణ్ రామ్, తారక్ రామ్ అని పేరు పెట్టారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీఆర్ ను 11 ఏళ్ల వయస్సులో కలవగా సీనియర్ ఎన్టీఆర్ తారక్ రామ్ పేరును తారక రామారావుగా మార్చారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న సమయంలో ఈ ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చారు.

తాత సీనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని శ్రీదేవి తన ఫేవరెట్ హీరోయిన్ అని జూనియర్ ఎన్టీఆర్ ఒక సందర్భంలో వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ కు 45 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న తారక్ తర్వాత సినిమాకు 60 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తారక్ తర్వాత ప్రాజెక్ట్ లకు కళ్యాణ్ రామ్ కూడా ఒక నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే నిర్మాతగా కళ్యాణ్ రామ్ కు కూడా మంచి లాభాలు దక్కే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

కళ్యాణ్ రామ్ ప్రస్తుతం బింబిసార సినిమాలో నటిస్తుండగా ఆగష్టు నెలలో ఈ సినిమా రిలీజ్ కానుంది. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు నెలకొన్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus