ఎన్టీఆర్ పోటీ చేస్తారా? ప్రచారానికే పరిమితమవుతారా?

రాజకీయంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రువులు మిత్రులవుతారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి జనసేన పార్టీ తో ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగుతున్నారు. సో టీడీపీకి కొంత బలం తగ్గుతుంది. ఆ బలాన్ని రాబట్టుకోవడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ప్రచారం చేయించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ వేశారట. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరుపున తారక్ బాగా ప్రచారం చేశారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కి మధ్య గొడవ జరిగిందని అప్పట్లో చెప్పుకున్నారు.

అయితే ఆ దూరాన్ని తగ్గించాలని టీడీపీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఎన్టీఆర్ అడిగితే కోరుకున్న నియోజకవర్గ సీటును ఇవ్వడానికి రెడీగా ఉన్నారంట. అంతేకాదు మంత్రి పదవిని కూడా చంద్రబాబునాయుడు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఆ ప్లాన్ లో భాగంగా నంది అవార్డుని అందించినట్లు టాక్. ఈ అవార్డు ప్రధానోత్సనికి ఎన్టీఆర్ హాజరైతే టీడీపీ ప్రచారానికి అతను ఒకే చెప్పినట్లేనని సినీ వర్గాల వారు, నేతలు అనుకుంటున్నారు. ఏమి జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus