Jr NTR: ఈ 5 మంది దర్శకులకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎన్టీఆరే..!

  • May 20, 2022 / 01:40 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ మూవీలో ఆయన చేసిన కొమరం భీమ్ పాత్రకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు దక్కింది. ఆ పాత్రకి ఎన్టీఆర్ జీవం పోశాడు. ఆ పాత్రకి ఎన్టీఆర్ తప్ప ఎవ్వరూ న్యాయం చేయలేరు అనడంలో అతిశయోక్తి లేదు. కొన్ని ప్రదేశాల్లో అయితే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర గెటప్ తో విగ్రహాలు కూడా పెట్టారు. ముఖ్యంగా నార్త్ లో ఇప్పుడు ఎన్టీఆర్ కు భీభత్సమైన క్రేజ్ ఉంది.

నిన్న ఆయన 30 వ చిత్రం మోషన్ పోస్టర్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఇది క్లియర్ గా తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ ఇప్పటివరకు 29 చిత్రాల్లో నటించాడు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ‘బాల రామాయణం’ ‘చింతకాయల రవి’ వంటి సినిమాలు కాకుండా చెప్పిన లెక్క ఇది. తన 21 ఏళ్ళ సినీ కెరీర్లో హీరోగా నటించిన 29 చిత్రాల్లో కొంతమంది కొత్త దర్శకులను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఘనత పొందాడు మన చిన రామయ్య. ఆ దర్శకులు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రాజమౌళి : ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో దర్శకుడిగా మారాడు రాజమౌళి. అంతకు ముందు ‘శాంతి నివాసం’ అనే టీవీ సీరియల్ ను ఆయన డైరెక్ట్ చేశాడు.

2) వి.వి.వినాయక్ : ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘ఆది’ చిత్రంతో వి.వి.వినాయక్ దర్శకుడిగా మారాడు.

3) డి.కె. సురేష్ : 2003 లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నాగ’ చిత్రంతో ఈయన దర్శకుడిగా పరిచయమయ్యాడు.

4) వర ముళ్ళపూడి : 2005 లో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘నా అల్లుడు’ చిత్రంతో ఈయన దర్శకుడిగా మారాడు.

5) మెహర్ రమేష్ : ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘కంత్రి’ చిత్రంతో ఈయన టాలీవుడ్ కు దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే అంతకు ముందు కన్నడ లో కొన్ని సినిమాలకి డైరెక్షన్ చేశాడు మెహర్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus