Jr NTR: అలాంటి రోల్స్ కు జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే సూట్ అవుతారా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. 2015 సంవత్సరానికి ముందు కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులతో కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొన్న ఈ హీరో ఆ తర్వాత కెరీర్ పరంగా వరుస విజయాలతో జోరు పెంచారు. డబుల్ హ్యాట్రిక్ విజయాలు ప్రేక్షకుల్లో తారక్ కు ఊహించని స్థాయిలో క్రేజ్ పెంచాయి. ప్రస్తుతం దేవర సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ పోషిస్తుండగా ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నటిస్తున్నారు.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో పౌరాణిక సినిమాలు చేయాలని భావిస్తున్న దర్శకులు అంతా ఎన్టీఆర్ వైపు చూస్తున్నారని తెలుస్తోంది. పౌరాణిక పాత్రల డైలాగ్ లను తారక్ అద్భుతంగా చెబుతారని భావించి చాలామంది దర్శకులు ఎన్టీఆర్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందో రాదో చూడాల్సి ఉంది. కథ, పాత్ర అద్భుతంగా ఉంటే తారక్ పౌరాణిక సినిమాలకు కూడా ఓకే చెబుతారని చెప్పవచ్చు.

మరో మూడేళ్ల పాటు తారక్ (Jr NTR) డైరీ ఫుల్ గా ఉందని సమాచారం అందుతోంది. రాజమౌళి మహాభారతం తెరకెక్కిస్తే ఆ సినిమాలో తారక్ కు కచ్చితంగా పాత్ర ఉంటుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నారు. తర్వాత సినిమాలు కూడా తారక్ కు గ్లోబల్ స్టార్ గా మరింత పాపులారిటీ పెంచాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా తాజాగా ఒక సందర్భంలో హృతిక్ రోషన్ సైతం తారక్ తో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఉందని చెప్పుకొచ్చారు. వార్2 సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అందుకే తారక్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల బడ్జెట్ 1000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తమని తెలుస్తోంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus