2019 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ దారుణమైన పరాజయం చవిచూసిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టి.డి.పి ఏకంగా ఉనికిని కోల్పోయే స్థాయిలో పరాభవం చవిచూడడంతో.. సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు మరియు టిడిపి ఫ్యాన్స్ అందరూ చంద్రబాబు తర్వాత టి.డి.పి పార్టీకి నాయకుడు లేడు అని బాధపడసాగారు. ఎందుకంటే.. ఆల్రెడీ చంద్రబాబుకి 70 ఏళ్ళు వచ్చే ఎలక్షన్స్ టైమ్ కి ఆయన పార్టీకి సేవలందించే లేదా నాయకత్వం వహించే స్థితిలో ఉంటాడో లేదో కూడా చెప్పలేని పరిస్థితి, ఇలాంటి తరుణంలో టి.డి.పికి నెక్స్ట్ లీడర్ ఎవరు అని చర్చలు ఆల్రెడీ మొదలైపోయాయి.
లోకేష్ బాబు పేరు వినిపించినప్పటికీ.. మనోడికి ఆంగ్ల భాష మీద ఉన్న పట్టు రాజకీయాల మీద లేదు. బ్రాహ్మణికి ఇంకా సరైన పరిజ్ణానమ్ లేదు. దాంతో అందరి చూపు ఒక్కసారిగా జూనియర్ ఎన్టీఆర్ వైపు మళ్ళింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి టి.డి.పికి నాయకత్వం వహించాలని అందరూ కోరుకొంటున్నారు. కానీ.. 36 ఏళ్ల జూనియర్ ఎన్టీఆర్ కి ఇంకా చాలా ఏళ్ల సినిమా కెరీర్ ఉంది. మరి తాతయ్య కల అయిన టి.డి.పి పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయంలో పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తాడా లేదా అనేది చూడాల్సి ఉంది.