Jr NTR, Vijay Devarakonda: విజయ్‌ ప్రయోగాత్మక చిత్రం.. తారక్‌ సాయం తీసుకుంటున్నారా?

ఓ హీరో సినిమాకు మరో హీరో వాయిస్ ఓవర్ ఇవ్వటం ఒకప్పుడు పెద్ద విషయంగా ఉండేది. అయితే కుర్ర హీరోలు ఒకరికొకరు హెల్ప్‌ చేసుకోవడం, దానిని ఆ సినిమా టీమ్‌ ప్రమోషనల్‌ ఎలిమెంట్‌ చేసుకోవడం ఎక్కువయ్యాక ‘గొంతు అందించే కార్యక్రమం’ టూ కామన్ అంటున్నారు. అయితే కుర్ర హీరో సినిమాకు సీనియర్‌ హీరో లేదంటే స్టార్ హీరో గొంతిస్తే విషయమే. ఇప్పుడు అలాంటిదే టాలీవుడ్‌లో జరుగుతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

Jr NTR, Vijay Devarakonda

విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) – గౌతమ్‌ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిదే. ఈ సినిమకాఏ తారక్‌ (Jr NTR) వాయిస్ ఓవర్ అందించబోతున్నారడట. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ జోనర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో తారక్‌ వాయిస్ ఓవ‌ర్ స్పెషల్‌గా ఉంటుంది అని టీమ్‌ భావిస్తోందట. దీంతో ఆ పని కోసం ఎన్టీఆర్‌ వయా త్రివిక్రమ్‌ (Trivikram) ప్లాన్‌ చేస్తున్నారు అని అంటున్నారు. అలాగే ఈ సినిమా నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార‌ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌తో ఎన్టీఆర్‌కు మంచి అనుబంధమే ఉంది.

ఈ నిర్మాణ సంస్థ‌లో గ‌తంలో ‘అర‌వింద స‌మేత వీర రాఘ‌వ’ (Aravinda Sametha Veera Raghava) అనే సినిమా చేశాడు తారక్‌. ఈ బ్యాన‌ర్‌లోనే వ‌చ్చిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Squre) సినిమా ప్రచారంలో కూడా పొల్గొన్నాడు. మరోవైపు ఎన్టీఆర్ తర్వాతి సినిమా ‘దేవ‌ర‌ పార్ట్‌ 1’ (Devara) ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేయబోతోంది. ఈ లెక్కన విజయ్‌ దేవరకొండ సినిమా కోసం తారక్‌ వాయిస్‌ ఇవ్వడం సాధ్యమే అని చెబుతున్నారు.

రూ. 80 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ఇప్ప‌టివ‌ర‌కు 80 శాతం స‌మాచారం అందుతోంది. ఈ సినిమాలో విజయ్‌ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడని టాక్‌. ఓ గెటప్‌లో షార్ట్ హెయిర్ క‌ట్‌, గ‌డ్డంతో కొత్తగా క‌నిపించాడు. 2025 మార్చి 28న ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఇప్పటికే విజయ్‌ లుక్‌తో సినిమా మీద హైప్‌ రాగా.. ఇప్పుడు తారక్‌ వార్తతో అది మరింత పెరిగింది అని చెప్పొచ్చు.

లియో విషయంలో జరిగిన తప్పు.. గోట్ విషయంలో జరగకూడదంట.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus