Jr NTR: ఈ యాడ్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఎన్ని టేక్స్ తీసుకున్నాడో తెలుసా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. వరుసగా ఆరు సూపర్ హిట్లతో డబుల్ హ్యాట్రిక్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ట్రిపులార్ రిలీజ్ అయ్యి 8 నెలల అవుతున్నా ఇంకా అదే మూడ్‌లో, హ్యాపీ మోడ్‌లో ఉన్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ జపాన్ ప్రమోషన్స్‌లో జపనీస్ లాంగ్వేజ్‌లో మాట్లాడి మరోసారి తన టాలెంట్‌తో అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. కొరటాల శివతో చేయబోయే తన తర్వాత సినిమా అప్‌డేట్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు తారక్..

తారక్ గురించి.. పర్సనల్ అయినా.. ప్రొఫెషనల్ అయినా.. ఏ చిన్న న్యూస్ వచ్చినా కానీ దాన్ని క్షణాల్లో వైరల్ చేసేస్తుంటారు అభిమానులు.. రీసెంట్‌గా యంగ్ టైగర్ యాక్ట్ చేసిన ఓ క్రేజీ యాడ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. సినిమాలు, మీలో ఎవరు కోటీశ్వరుడు, బిగ్ బాస్ లాంటి టాక్ షోలే కాకుండా.. నవరత్న ఆయిల్, యాపీ ఫీజ్, సెలెక్ట్ మొబైల్స్, ఓట్టో వంటి పలు కమర్షియల్స్‌లోనూ యాక్ట్ చేసి దుమ్ము దులిపాడు జూనియర్.

ఇప్పుడు తారక్ ఖాతాలో కొత్త బ్రాండ్ వచ్చి చేరింది.. పాపులర్ ఆన్‌లైన్ మీట్ స్టోర్ లిషెస్‌కి తారక్ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన మొదటి ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఆరు పేజీల డైలాగ్ అరసెకనులో చెప్పగలరు.. మీకు ఇంత చిన్న డైలాగ్‌కి’’.. అని రాహుల్ రామకృష్ణ అంటుండగా.. ‘‘చేప చిన్నదే అయినా ఎర పెద్దది వెయ్యాలి’’.. అంటూ తారక్ కంపేర్ చేసి చెప్పడం బాగుంది.. ‘‘లిషెస్ ప్రతిరోజూ 23 వేర్వేరు ప్రాంతాల నుండి ఫ్రెష్‌గా ఎంపిక చేసిన చేపల్ని ఎంపిక చేసి,

ఫ్లైట్‌లో ట్రాన్స్‌పోర్ట్ చేసి, డోర్‌కి డెలివరీ చేస్తారు..సింగిల్ చేపైనా.. సేమ్ ప్రాసెస్.. నాలాగే.. డైలాగ్ చిన్నదే అయినా.. డైలెక్ట్ పర్ఫెక్ట్‌గుండాలి’’.. అంటూ తారక్ చేసిన యాడ్ బాగా ఆకట్టుకుంటోంది. తారక్ డిఫరెంట్ మేకోవర్‌తో సరికొత్త లుక్‌లో స్టైలిష్‌గా బాగున్నాడు.. త్వరలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 30వ సినిమా సెట్స్ మీదకెళ్లబోతుంది.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus