Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూట్ మారుస్తారా.. వాళ్లపై ఫోకస్ పెట్టాల్సిందే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర  (Devara)  సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది. అన్న కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ఈ సినిమాకు నిర్మాత కావడంతో సినిమా సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ ఆర్థిక ఇబ్బందులు సైతం తొలగిపోయే ఛాన్స్ ఉంటుందని చెప్పవచ్చు. మరోవైపు దేవర సినిమాపై బాలీవుడ్, ఇతర భాషల్లో అంచనాలు పెంచాల్సిన బాధ్యత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ఉంది. దేవర ప్రమోషన్స్ విషయంలో అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు.

పాన్ ఇండియా సినిమాకు జరగాల్సిన స్థాయిలో ఈ సినిమాకు ప్రమోషన్స్ ఇంకా మొదలుకాలేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తే దేవరపై అంచనాలు పెరుగుతాయో అభిమానులకు దేవర వేగంగా రీచ్ అవుతుందో వాళ్లపై తారక్ ఫోకస్ పెట్టాల్సిన తరుణం అయితే ఆసన్నమైందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అలా చేస్తే మాత్రమే ఈ సినిమాకు 1000 కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తాయి. కొరటాల శివకు (Koratala Siva)  తెలుగులో ఉన్న స్థాయిలో ఇతర భాషల్లో గుర్తింపు లేదు.

మరోవైపు ఆచార్య (Acharya) వల్ల కొరటాల శివ ప్రమోషన్స్ విషయంలో ఎలా వ్యవహరిస్తారో క్లారిటీ లేదు. అందువల్ల తారక్ ఇప్పటినుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. దేవర టీజర్ ను వీలైనంత వేగంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని అభిమానులు ఫీలవుతున్నారు. ఈ ఏడాది దసరా సెలవులను పూర్తిస్థాయిలో క్యాష్ చేసుకోవాలని ఎన్టీఆర్ గట్టిగా ఫిక్స్ అయ్యారు.

జాన్వీ కపూర్  (Janhvi Kapoor)  దేవరతో సక్సెస్ సాధిస్తే కొన్నేళ్ల పాటు వరుస ఆఫర్లతో కెరీర్ పరంగా బిజీగా ఉండే అవకాశం ఉంది. దేవర సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 207 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగిందని సమాచారం అందుతోంది. ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్టు తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో ఈ సినిమా నటిస్తారని వినిపిస్తున్నా సెకండ్ రోల్ లుక్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus