Jr NTR: ఆ స్టార్ హీరోకు ఎన్టీఆర్ షాకిచ్చారా..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు వరుసగా విజయాలను సొంతం చేసుకోవాలన్నా, సినిమాసినిమాకు మార్కెట్ పెరగాలన్నా సరైన ప్లానింగ్ ఎంతో అవసరం. అయితే ఎన్టీఆర్ మాత్రం ఇతర హీరోల ఊహలకు కూడా అందని ప్లానింగ్ తో కెరీర్ విషయంలో ముందడుగులు వేస్తున్నారు. ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించడానికి ఏకంగా ఆరుగురు డైరెక్టర్లు క్యూలో ఉండటం గమనార్హం. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్న తారక్ ఈ సినిమా తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో నటించనున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ సినిమా పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ 32వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఎన్టీఆర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందనే వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ డైరెక్టర్లలో పాటు అనిల్ రావిపూడి, పరశురామ్ కూడా ఎన్టీఆర్ తో సినిమాలను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ సినిమాకు డైరెక్షన్ చేయబోయే దర్శకుల జాబితాలో మరి కొందరు కోలీవుడ్, బాలీవుడ్ డైరెక్టర్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు ఎన్టీఆర్ బన్నీకి షాకిచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కొన్ని రోజుల క్రితం బన్నీ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా ప్రకటన వెలువడటంతో బన్నీ ప్రశాంత్ నీల్ కాంబో సినిమా తాత్కాలికంగా వాయిదా పడినట్టేనని చెప్పవచ్చు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus