Jr NTR: ఎన్టీఆర్ పై మరోసారి విరుచుకుపడుతున్న బాలయ్య అభిమానులు!

ఈరోజు అనగా జూన్ 10 న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఇది బాలయ్యకి 63 వ పుట్టినరోజు. ట్విట్టర్లో బాలయ్యకి ఎటువంటి ఖాతా లేకపోయినా #HappyBirthdayNBK అనే హ్యాష్ ట్యాగ్ అర్ధరాత్రి నుండి ట్రెండ్ అవుతుంది. బాలయ్య ఇప్పుడు మంచి ఫామ్లో ఉన్నాడు. ‘అఖండ’ ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. ప్రస్తుతం ‘షైన్ స్క్రీన్స్’ వారి నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘భగవంత్ కేసరి’ అనే సినిమా చేస్తున్నాడు.

అలాగే ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఆ సినిమాల నిర్మాణ సంస్థలు బాలయ్యకి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేశాయి. అయితే పెద్ద హీరోలు ఎవ్వరూ కూడా బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్లు వేసింది లేదు. అందరూ ఎలా ఉన్నా ఎన్టీఆర్.. తన బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వేయలేదు.

నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం ‘భగవంత్ కేసరి’ టీజర్ లింక్ ను షేర్ చేసి మరీ బాలయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ వేశాడు. ఎన్టీఆర్ నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు. అందరు హీరోలు ఎలా ఉన్నా.. ఎన్టీఆర్ కనుక ట్వీట్ వేసుంటే పాజిటివ్ వాతావరణం ఏర్పడి ఉండేది. అసలే ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు జూ.ఎన్టీఆర్ హాజరుకాలేదు అని నందమూరి అభిమానులు మండిపడ్డారు.

ఎన్టీఆర్ ఘాట్ వద్ద కూడా జూ.ఎన్టీఆర్ (Jr NTR) ప్రవర్తన విస్మయం కలిగించింది. అందుకే ఎన్టీఆర్ ను నందమూరి అభిమానులు, బాలయ్య అభిమానులు భారీగా ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ఒకవేళ సోషల్ మీడియాలో విషెస్ చెప్పకపోయినా ఫోన్ చేసి బాలయ్యకి ఎన్టీఆర్ .. బర్త్ డే విషెస్ చెప్పి ఉండొచ్చు కదా’ అంటూ ఎన్టీఆర్ ను వెనకేసుకొచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నిజమే కదా..!

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus