చావు బ్రతుకుల్లో ఉన్న అభిమానికి, అతని తల్లికి ఫోన్ చేసి భరోసా ఇచ్చిన ఎన్టీఆర్ ..!

  • June 29, 2022 / 11:12 PM IST

ఎన్టీఆర్ కు ఎంతో మంది డై హార్డ్ ఫ్యాన్స్ ఉంటారు…. ఉన్నారు. అందులో జనార్ధన్ అనే వ్యక్తి కూడా ఒకడు.ఇతను శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి. ఇటీవల ఇతను ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. కానీ అతని పరిస్థితి ఏమాత్రం బాలేదు. జనార్దన్ కోమాలోకి వెళ్ళిపోయాడు. దీంతో అతని స్నేహితులు ఈ విషయాన్ని ఎన్టీఆర్ వరకు తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎన్టీఆర్… తన సన్నిహితులతో జనార్దన్ ను అతని స్నేహితులను సంప్రదించాడు.

ఈ క్రమంలో జనార్దన్ కోసం ఎన్టీఆర్ ఫోన్ చేయగా.. అక్కడి డాక్టర్లు తీసుకెళ్లి జనార్దన్ కు వినిపించే ప్రయత్నం చేశారు. ‘జనార్దన్… జనార్దన్.. నేను ఎన్టీఆర్ ని మాట్లాడుతున్నాను. నువ్వు త్వరగా కోలుకొని వస్తే కలుద్దాం మనం. దేవుడు మీద భారం పెట్టు. దేవుడిని బలంగా నమ్ముకో. నువ్వు ఎంత త్వరగా కోలుకుని వస్తే అంత త్వరగా కలుద్దాం మనం. నిన్ను చూడాలని నాకు కూడా ఉంది. నేనున్నాను, అభిమానులు మేమంతా ఉన్నాం.

నీకేం కాదు నువ్వు త్వరగా కోలుకుని వస్తావ్’ అంటూ ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. ఆ టైములో ఎన్టీఆర్ మాటలు విని జనార్దన్ చెయ్యి వేళ్ళు కదిపాడట. అనంతరం జనార్దన్ తల్లితో కూడా ఎన్టీఆర్ మాట్లాడాడు. జనార్దన్ తల్లి.. ఎన్టీఆర్ తో ఫోన్లో మాట్లాడుతూ.. “నా బిడ్డని సర్…. నువ్వంటే ప్రాణం అంటాడు. నువ్వంటే దేవుడంటాడు. నాకు ఒక్కగానొక్క కొడుకు. లేక లేక పుట్టాడు ” అంటూ ఆమె ఎన్టీఆర్ ను వేడుకుంది. ఇందుకు ఎన్టీఆర్ స్పందిస్తూ..

“అమ్మా… మీరు ధైర్యాన్ని కోల్పోకండి. మేమంతా ఉన్నాం. పైన భగవంతుడు ఉన్నాడు. మీరు ధైర్యంగా ఉండండి.. అధైర్య పడొద్దు. జనార్దన్ త్వరగా కోలుకుని మన మధ్యకి వస్తాడు మేమంతా ప్రార్థిస్తున్నాం” అంటూ ఆమెకి ధైర్యం చెప్పాడు ఎన్టీఆర్. జనార్దన్ కోలుకుని రావాలని ఎన్టీఆర్ తో పాటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు అందరూ కూడా ప్రార్ధిస్తున్నట్టు కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus