యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో (Jr NTR) కలిసి పని చేసిన వాళ్లు ఆయన గొప్పదనానికి సంబంధించి, టాలెంట్ గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కొన్ని సెకన్ల షాట్ లోనే అద్భుతంగా ఎక్స్ ప్రెషన్స్ పలికించే ప్రతిభ తారక్ సొంతమనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి చేరుకోవడం వెనుక ఎంతో కష్టం ఉంది. వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా టాలెంట్ తోనే తారక్ ఎదిగారు. సింహాద్రి (Simhadri) సినిమా తర్వాత, బృందావనం (Brindavanam) సినిమా తర్వాత కొన్నేళ్ల పాటు వరుస ఫ్లాపులు ఎదురైనా వాటిని అధిగమిస్తూ తారక్ సత్తా చాటారు.
యమదొంగ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ కు స్టార్ మా అవార్డ్ రాగా చిరంజీవి చేతుల మీదుగా తారక్ ఆ అవార్డ్ ను అందుకోవడం జరిగింది. ఆ సమయంలో తారక్ మాట్లాడుతూ చిరంజీవి (Chiranjeevi) , నాగార్జున (Nagarjuna), బాబాయ్ సినిమాలు చూస్తూ పెరిగామని వెల్లడించారు. అయితే ఈ ఈవెంట్ జరుగుతున్న తరుణంలోనే ప్రముఖ సినీ నటుడు శోభన్ బాబు మరణించగా జూనియర్ ఎన్టీఆర్ శోభన్ బాబును తలచుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
తనకు వచ్చిన అవార్డ్ ను శోభన్ బాబు ఇంటికి చేరవేయాలని జూనియర్ ఎన్టీఆర్ స్టార్ మా సభ్యులను కోరారు. ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సంస్కారానికి చిరంజీవి సైతం ఫిదా అయ్యారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర (Devara) సినిమాతో భారీ హిట్ ను అందుకోవడంతో పాటు మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేస్తారని అభిమానులు ఫీలవుతున్నారు.
రెండు పార్టులుగా తెరకెక్కుతున్న దేవర తారక్ కెరీర్ లో స్పెషల్ సినిమాగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ ఈ సినిమా పూర్తైన వెంటనే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. సినిమా బడ్జెట్, బ్యానర్ ను బట్టి తారక్ పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.