ప్రముఖ టాలీవుడ్ దర్శకనిర్మాతలలో పీఎన్ రామచంద్రా రావు ఒకరనే సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో భక్త మార్కండేయ సీరియల్ తీసిన పీఎన్ రామచంద్రా రావు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు తనపై గురు భావం ఉండేదని అన్నారు. నేను అప్పటికి సంపాదించిన ఆస్తులను పోగొట్టుకున్న స్థితిలో ఉన్నానని ఆయన చెప్పుకొచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఇంట్లో మనిషిలా అయ్యారని జరిగినవన్నీ ఆయన తెలుసుకున్నారని పీఎన్ రామచంద్రారావు చెప్పుకొచ్చారు.
జూనియర్ ఎన్టీఆర్ పెద్ద హీరో అవుతాడని నాకు ముందే తెలుసని నా జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదని రామచంద్రారావు కామెంట్లు చేశారు. జయప్రకాష్ రెడ్డి, ప్రకాష్ రాజ్ విషయంలో కూడా తాను చెప్పిందే నిజమైందని ఆయన కామెంట్లు చేశారు. నేను వెళ్లి అడిగితే నాకు చేయగల స్థితిలో వాళ్లు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. నేను ఎప్పుడూ వెళ్లి ఎవరిని అడిగింది లేదని ఆయన కామెంట్లు చేశారు. ఆ సమయంలో మీరు పోగొట్టుకున్న మొత్తం నా వల్ల రావాలని ఎన్టీఆర్ చెప్పారని పీఎన్ రామచంద్రారావు చెప్పుకొచ్చారు.
నాతో సినిమా చేస్తానని ఎన్టీఆర్ మోరల్ గా మాట్లాడారని పీఎన్ రామచంద్రావు కామెంట్లు చేశారు. నా జీవితంలో డిజాస్టర్, రెండు వారాలు ఆడిన సినిమాలు లేవని ఆయన చెప్పుకొచ్చారు. హరికృష్ణ గారిని నమ్మించి తాను ఎన్టీఆర్ తో సీరియల్ చేయించానని ఆయన తెలిపారు. భక్త మార్కండేయ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని అనుకున్నానని అయితే ఆ సమయంలోనే తారక్ నిన్ను చూడాలని,
స్టూడెంట్ నంబర్1 సినిమాలలో హీరోగా ఎంపికయ్యాడని ఆయన తెలిపారు. స్టూడెంట్ నంబర్1 హిట్ అయిన వెంటనే తారక్ వెంట నిర్మాతలు క్యూ కట్టారని ఆయన చెప్పుకొచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలన్న కోరిక చేయలేదని ఆయన తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీని రూల్ చేస్తాడని తాను అప్పుడే చెప్పానని ఆయన కామెంట్లు చేశారు.