Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పార్టీ ప్రచారం గురించి క్లారిటీ ఇదే!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2024 ఎన్నికల్లో టీడీపీ తరపున ప్రచారం చేస్తారని తారకరత్న తాజాగా వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. గత కొన్నేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలపై దృష్టి పెడతారా? లేదా? అని మరోసారి చర్చ జరుగుతోంది. అయితే తారక్ సన్నిహితులు మాత్రం ఆ ప్రచారంలో నిజం లేదని చెబుతున్నారు. మరికొన్ని సంవత్సరాల పాటు తారక్ పూర్తిస్థాయిలో సినిమాలకే పరిమితమవుతారని 2023లో తారక్ రెండు సినిమాల షూటింగ్ లు మొదలవుతాయని ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.

ఎన్టీఆర్30 ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందేహాలకు సైతం మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో స్పష్టత రానుందని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి షాకింగ్ అప్ డేట్ ఇవ్వనున్నారని సమాచారం. కొరటాల సినిమాతో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని భావిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వచ్చే ఏడాది దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. సంక్రాంతికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుగుతాయని ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూట్ మొదలుకానుందని సమాచారం.

తారక్ కు జోడీగా జాన్వీ కపూర్ ఎంపిక కాగా జాన్వీ సైతం తనను హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు అధికారిక ప్రకటన రావాలని కోరుకుంటున్నారు. బడ్జెట్ విషయంలో లిమిట్స్ లేకుండా ఈ సినిమా షూట్ జరగనుండగా కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో ఎన్టీఆర్ కు నిర్మాతగా మరో సక్సెస్ ను ఇవ్వాలని భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సక్సెస్ తో తారక్ రెమ్యునరేషన్ సైతం పెరిగిందనే సంగతి తెలిసిందే. తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ 200 కోట్ల రూపాయల నుంచి 300 కోట్ల రూపాయల స్థాయి బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus