NTR, Rajamouli: యంగ్ టైగర్ భలే ప్లాన్ వేశాడుగా!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షోతో హోస్ట్ గా కూడా సక్సెస్ అయ్యారు. ఇప్పటికే ఈ షోలో రామ్ చరణ్ గెస్ట్ గా హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. అయితే రాబోయే రోజుల్లో ఈ షోలో దర్శకధీరుడు రాజమౌళి కూడా పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. రాజమౌళితో పాటు రాఘవేంద్రరావు కూడా ఈ షోలో పాల్గొనబోతున్నారని సమాచారం. ఎవరు మీలో కోటీశ్వరులు షో ద్వారా ఎన్టీఆర్ ప్రేక్షకులకు విజ్ఞానాన్ని పంచుతున్నారు.

గతంలో నాగార్జున, చిరంజీవి ఎవరు మీలో కోటీశ్వరులు షోను సక్సెస్ ఫుల్ గా హోస్ట్ చేశారు. ఎన్టీఆర్ కంటెస్టెంట్లతో డీల్ చేస్తున్న విధానం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రాజమౌళి ఎవరు మీలో కోటీశ్వరులు షోకు గెస్ట్ గా హాజరవుతున్న నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన మరిన్ని సీక్రెట్లను వెల్లడిస్తారేమో చూడాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఆర్ఆర్ఆర్ ఫస్ట్ సాంగ్ ఊహించని స్థాయిలో హిట్ అయింది. ఎవరు మీలో కోటీశ్వరుడు షో ద్వారా ఆర్ఆర్ఆర్ కు గట్టిగా ప్రమోషన్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ షో ద్వారానే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన స్పష్టత వస్తుందేమో తెలియాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ హీరోయిన్లను సైతం ఈ షోకు ఆహ్వానిస్తారేమో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్, రాజమౌళి మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జక్కన్న కాంబోలో తెరకెక్కుతున్న 4వ సినిమా ఆర్ఆర్ఆర్ కావడం గమనార్హం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus