NTR, Ravi Teja: భిన్న దారుల్లో పయనిస్తున్న తారక్, రవితేజ.. ఎవరి ప్లాన్ రైట్ అవుతుందో?

టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నిదానంగా సినిమాలలో నటిస్తున్నారు. ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం కంటే క్వాలిటీ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలలో నటించాలని తారక్ భావిస్తున్నారు. ఎన్టీఆర్30 కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మార్చి నెలాఖరు నుంచి ఈ సినిమా షూట్ మొదలుకానుండగా నవంబర్ నెలాఖరు నాటికి ఈ సినిమా షూట్ పూర్తి కానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తారక్ నటించనున్నారు.

ఈ ప్రాజెక్ట్ లు మినహా జూనియర్ ఎన్టీఆర్ మరే ప్రాజెక్ట్ లో నటించడం లేదనే సంగతి తెలిసిందే. అయితే తారక్ నిదానమే ప్రధానం అనే సూత్రాన్ని ఫాలో అవుతుంటే రవితేజ మాత్రం ఆలస్యం అమృతం విషం అనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. గడిచిన 12 నెలల్లో రవితేజ నటించిన నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నాలుగు సినిమాలలో 2 సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోగా 2 సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి.

ఇద్దరు స్టార్ హీరోలు భిన్న దారుల్లో ప్రయాణం చేస్తుండగా ఎవరి ప్లానింగ్ రైట్ అవుతుందో చూడాల్సి ఉంది. రవితేజ ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండగా జూనియర్ ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఎన్టీఆర్30 పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.

తారక్ జాన్వీ కపూర్ కాంబోను చూడటానికి ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రిజల్ట్ విషయంలో కొరటాల శివ కాన్ఫిడెన్స్ తో ఉన్నారని తెలుస్తోంది. ఇకపై వేగంగా సినిమాలను తెరకెక్కించాలని కొరటాల శివ భావిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus