ఆ సీన్ ను రీషెడ్యూల్ చేయాలంట.. ఆ సీన్ వల్ల ఎన్ని కోట్ల నష్టమా.!

RRR వంటి సెన్సేషన్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ తో గత కొద్దిరోజుల నుండి ‘దేవర’ అనే చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రారంభం అవ్వడానికి చాలా సమయమే పట్టింది. కానీ షూటింగ్ మొదలైన రోజు నుండి నేటి వరకు జెట్ స్పీడ్ లో షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ పూర్తి చేసుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ చిత్రం.

అయితే ఈ సినిమా షూటింగ్ కి సంబంధించి సోషల్ మీడియా లో ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా ఫైట్ సన్నివేశాల చిత్రీకరణ గురించి మాత్రమే వస్తుంది. అప్పుడు అభిమానుల్లో అసలు ఈ సినిమాలో ఫైట్స్ తప్ప స్టోరీ లేదా అనే సందేహం మొదలైంది. మరీ అంత వయోలెన్స్ ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్ కి రావడం కష్టం అని అంటున్నారు ఫ్యాన్స్. ఎన్టీఆర్ సినిమాలకు మొదటి నుండే ఫ్యామిలీ ఆడియన్స్ కరువు, ఇప్పుడు ఈ సినిమాతో మరింత దూరం అవుతాడేమో అని భయపడుతున్నారు.

ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన రషస్ ని ఎన్టీఆర్ చూశాడట. ఔట్పుట్ మీద ఆయన అసంతృప్తి గా ఉన్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నాల్గవ షెడ్యూల్ లో క్లైమాక్స్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. రైల్వే స్టేషన్ సెట్ లో సైఫ్ అలీ ఖాన్ మరియు ఎన్టీఆర్ మీద తీసిన ఈ ఫైట్ సన్నివేశాన్ని రీసెంట్ గానే చూశాడట ఎన్టీఆర్. ఔట్పుట్ మీద చాలా అసంతృప్తి వ్యక్తపరిచినట్టు చెప్తున్నారు.

ఈ షెడ్యూల్ చెయ్యడానికి దాదాపుగా 20 కోట్ల రూపాయిలు ఖర్చు అయ్యింది. ఇప్పుడు ఆ ఔట్పుట్ మొత్తాన్ని తొలగించి మల్లి రీ షూట్ చేయాల్సిందిగా ఎన్టీఆర్ డిమాండ్ చేస్తున్నాడట. దీనితో ఈ సినిమాకి ఓవర్ బడ్జెట్ అయిపోతుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి 300 కోట్ల రూపాయిల వరకు బడ్జెట్ అవుతుందని సమాచారం. మరి రాబొయ్యే రోజుల్లో ఎంత ఖర్చు అవుతుందో చూడాలి.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus