Jr NTR: నా ప్రాబ్లమ్ అదే అంటున్న ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలెంటెడ్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేసి ఎన్టీఆర్ ప్రశంసలను అందుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో ఎన్టీఆర్ బిజీగా ఉంటూనే రియాలిటీ షోలతో కూడా ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు స్లిమ్ లుక్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ రాఖీ సినిమా వరకు బొద్దుగా కనిపించిన సంగతి తెలిసిందే.

యమదొంగ సినిమా సమయంలో రాజమౌళి సూచనల మేరకు ఎన్టీఆర్ తన లుక్ ను మార్చుకున్నారు. తాజా ప్రోమోలో ఎన్టీఆర్ కంటెస్టెంట్ తో వన్ డే బ్యాచిలర్ అంటే అది పెళ్లికి క్వాలిఫికేషన్ కూడా అని కామెంట్ చేస్తారు. కంటెస్టెంట్ తనకు లేనిపోని థాట్స్ ఇవ్వకండి సార్ అని సమాధానం ఇస్తాడు. అప్పుడు ఎన్టీఆర్ నీకు సమస్య జుట్టు అని నాకు కొవ్వు సమస్య అని చెబుతాడు. తాను ఒకప్పుడు చాలా లావుగా ఉండేవాడినని అసహ్యంగా ఉన్నావని అన్నారని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

మీ దగ్గర అమ్మ చేతి వంటను అందరికీ పరిచయం చేయాలనే మంచి సంకల్పం ఉందని ఎన్టీఆర్ కంటెస్టెంట్ ను మెచ్చుకున్నారు. ఎవరు మీలో కోటీశ్వరులు షోలో ఎన్టీఆర్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుందని యంగ్ టైగర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటలకు ఈ షో ప్రసారమవుతోంది.


చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus