Jr NTR: ‘మ్యాడ్’ చిత్రాన్ని వీక్షించిన ఎన్టీఆర్.. ఏమన్నాడంటే?

ఎన్టీఆర్ బావమరిది,ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన నార్నె శ్రీనివాసరావు కొడుకు నార్నె నితిన్ హీరోగా ‘మ్యాడ్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగవంశీ సమర్పణలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ అధినేత చినబాబు కూతురు హారిక ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అక్టోబర్ 6 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించడం..

సూపర్ హిట్ లిస్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేయడం కూడా జరిగింది. ఇక ఈ చిత్రాన్ని వీక్షించిన (Jr NTR) ఎన్టీఆర్.. తన అభిప్రాయాన్ని కూడా బావమరిది నార్నె నితిన్ కి తెలిపినట్టు నిన్న జరిగిన సక్సెస్ మీట్ లో అతను చెప్పుకొచ్చాడు. నార్నె నితిన్ మాట్లాడుతూ.. ” మా ‘మ్యాడ్’ సినిమాకి ఈరోజు ఇంత మ్యాడ్ రెస్పాన్స్ వస్తుందంటే అది మా డైరెక్టర్ కళ్యాణ్ గారి వల్లే అని చెప్పాలి. కళ్యాణ్ అన్న ఇంకా చాలా సినిమాలు తీసి హిట్లు కొట్టాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆ హిట్లలో మేమూ ఉండాలి. ఈ సినిమాని మా అక్క(లక్ష్మి ప్రణతి), బావ(జూనియర్ ఎన్టీఆర్) చూశారు. బావకి చాలా బాగా నచ్చింది. అక్కకి డబుల్, ట్రిపుల్ నచ్చింది. పిల్లలైతే(అభయ్ రామ్, భార్గవ్ రామ్) ‘నితిన్ మామ… నితిన్ మామ’ అంటూ అరుస్తూ బాగా ఎంజాయ్ చేశారు. డైరెక్టర్ ని, మమ్మల్ని నమ్మి ఈ సినిమాని నిర్మించినందుకు వంశీ అన్నకి, హారికకి, చినబాబు గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను” అంటూ అతను చెప్పుకొచ్చాడు.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus