Jr NTR: నెగిటివ్ షేడ్స్ లో ఎన్టీఆర్ రోల్.. జై పాత్రను మరిపించేలా?

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఎన్టీఆర్30 సినిమాలో విలన్ ఇతనేనంటూ వేర్వేరు పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే ఈ సినిమాలో అతిపెద్ద విలన్ జూనియర్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది. సినిమాలో అందరి కంటే చెడ్డవాడు తారక్ అని చెడ్డవాడు అన్యాయంపై చేసే యుద్ధమే ఎంతో గ్రేట్ అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతోందని బోగట్టా. కేజీఎఫ్ లో యశ్ రోల్ ఏ విధంగా ఉంటుందో ఈ సినిమాలో తారక్ రోల్ అదే విధంగా ఉంటుందని సమాచారం అందుతోంది.

ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు స్కోప్ ఉండగా ఒక పాత్రకు జాన్వీ కపూర్ ఎంపికయ్యారు. ఈ సినిమాలో మరో రోల్ కోసం కృతిశెట్టి పేరును పరిశీలిస్తుండగా ఆమె ఎంపికవుతారో లేక మరో హీరోయిన్ ను ఎంపిక చేస్తారో చూడాల్సి ఉంది. మే నెల 20వ తేదీన ఎన్టీఆర్30 సినిమా టైటిల్ ను రివీల్ చేసే ఛాన్స్ అయితే ఉంది. వేర్వేరు టైటిల్స్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తుండగా ఈ సినిమాకు పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేయాలని కొరటాల శివ భావిస్తున్నట్టు సమాచారం.

జనతా గ్యారేజ్ కాంబినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా కొరటాల కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ (Jr NTR) కొరటాల కాంబో బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది. ఎన్టీఆర్30 బడ్జెట్ విషయంలో నిర్మాతలు రాజీ పడటం లేదని బోగట్టా. ఈ సినిమాకు సంబంధించి లెంగ్తీ షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారని తెలుస్తోంది.

వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కానుండగా ఎంతో ప్లానింగ్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది. ఎన్టీఆర్30 సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని బోగట్టా. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ అనే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. జై లవకుశ సినిమాలో జై రోల్ ను మరిపించేలా ఈ సినిమాలో ఎన్టీఆర్ రోల్ ఉంటుందని సమాచారం.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus