Jr NTR: రాజమౌళి పై ఎన్టీఆర్ సెటైర్, అది మాత్రం చెప్పడట..!

రాజమౌళి ఓ సినిమా చేస్తున్నాడు అంటే అందరి దృష్టి ఆ సినిమా పైనే పడుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ఏదో ఒక విషయం తెలుసుకోవాలని ప్రేక్షకులు అనుక్షణం తపన పడుతుంటారు. కానీ రాజమౌళికి మాత్రం తన సినిమాకి సంబంధించిన విషయాలను షూటింగ్ దశలో షేర్ చేసుకోవడానికి ఇష్టపడడు. అయినప్పటికీ అతని సినిమాలకు సంబంధించిన లీకులు జరుగుతూనే ఉంటాయి. నిజానికి ఇవన్నీ అతని సినిమాపై మరింత అంచనాలు చేకూరేలా చేస్తాయి అనే విషయం తెలిసినా.. రిలీజ్ టైములో ఎక్కడ వారికి ఆసక్తి తగ్గిపోతుందో అనేది రాజమౌళి భయం కావచ్చు.

ప్రస్తుతం రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ అనే భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్,చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ఎన్టీఆర్ కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉంటున్న ఎన్టీఆర్.. సీక్రెట్ గా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. వీడియో కాల్ ద్వారానే అతను ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నట్టు సమాచారం. ఈ ఇంటర్వ్యూలో ‘ఆర్.ఆర్.ఆర్’ కు సంబంధించి బోలెడన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ కు ముందు అతను 71 కిలోల బరువు ఉండేవాడట..

తరువాత ఈ సినిమా కోసం 9 కిలోలు పెరిగినట్లు’ చెప్పుకొచ్చాడు.ఇక ‘తాను పోషిస్తున్న కొమురం భీమ్ పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేసానని.. 18 నెలలు ఈ పాత్ర కోసం హోమ్ వర్క్ చేసినట్లు తెలిపాడు. నవంబర్ 2018 న ఈ చిత్రం షూటింగ్ మొదలైందని…రాజమౌళితో సినిమా అంటే ఏళ్ళకు ఏళ్ళు సమర్పించుకోవాల్సిందేనని… దానికి తోడు కరోనా పాండమిక్ వల్ల మరో 8 నెలలు షూటింగ్ వాయిదా పడిందని’ ఇంకా చాలా విషయాలు చెప్పుకొచ్చాడు.అయితే విడుదల తేదీ గురించి ప్రశ్నించగా.. ‘అక్టోబర్ 13 నే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని.. ఇంతకు మించి రివీల్ చేస్తే జక్కన్న గొడ్డలి పట్టుకుని వస్తాడని’ ఫన్నీ కామెంట్స్ చేసాడు ఎన్టీఆర్.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus