పాలిటిక్స్ విషయంలో తారక్ నిర్ణయం ఇదేనా?

  • March 18, 2023 / 09:22 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలలో వరుస విజయాలతో దూసుకెళుతుండగా ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా హడావిడి చేయడం లేదు. ఇతర రాష్ట్రాలలోని కార్యక్రమాలకు హాజరు కావాలని పిలుపు వస్తున్నా పొలిటికల్ గా సంబంధం ఉన్న కార్యక్రమాలకు తారక్ నో చెబుతున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ఏ రాజకీయ పార్టీలో యాక్టివ్ గా లేరు.

2024 ఎన్నికలకు ఏడాది సమయం మాత్రమే ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఏపీ రాజకీయాలలో వేలు పెట్టడానికి ఇష్టపడటం లేదు. చిరంజీవిలా రాజకీయాలకు దూరంగా ఉంటూ అందరివాడు అనిపించుకోవాలని తారక్ కోరుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం అమిత్ షాను తారక్ కలిసిన సమయంలో బీజేపీ తరపున తారక్ ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వైరల్ అయిన ఫేక్ వార్తలు జూనియర్ ఎన్టీఆర్ ను ఒకింత హర్ట్ చేశాయి.

తాజాగా పొలిటికల్ టచ్ ఉన్న ఒక నేషనల్ ఛానల్ నుంచి ఆహ్వానం అందినా తారక్ ఆ ఛానల్ విషయంలో సైలెంట్ గా ఉండటం వెనుక అసలు రీజన్ ఇదేనని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యులను కలిసే అవకాశం వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ సున్నితంగా వదులుకున్నారని సమాచారం అందుతోంది. రాజకీయాలకు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ నుంచి మౌనమే సమాధానంగా ఉంటుందని బోగట్టా.

ఇంటర్వ్యూలలో సైతం పాలిటిక్స్ కు సంబంధించిన ప్రశ్నలు అడగవద్దని తారక్ క్లారిటీతో ఉన్నారని సమాచారం. తెలుగుదేశం విషయంలో తారక్ న్యూట్రల్ గా ఉన్నారని ఎలాంటి నెగిటివ్ కామెంట్లకు ఆస్కారం ఇవ్వకూడదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. సినిమాలకు సంబంధించి పదేపదే అప్ డేట్స్ అడగవద్దని ఎన్టీఆర్ అభిమానులకు సూచిస్తున్నారు. కొరటాల శివపై ఒత్తిడి పెరగకూడదని ఎన్టీఆర్ భావిస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus