Jr NTR: పాన్ ఇండియా హీరోల జాబితాలో రెండో స్థానంలో ఎన్టీఆర్!

  • May 27, 2022 / 02:34 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని RRRసినిమా ద్వారా పాన్ ఇండియన్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నటనకు అధిక ప్రాధాన్యత ఇస్తూ కొన్ని సన్నివేశాలలో తన స్థాయికి తగ్గ సినిమాలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ విధంగా ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన తదుపరి సినిమాలను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ మరొక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా ఆర్మాక్స్ మీడియా 2022 సంవత్సరం ఏప్రిల్ వరకు పాన్ ఇండియా స్టార్స్ పై అధ్యయనం చేసి టాప్ టెన్ పాన్ ఇండియా స్టార్ హీరోల జాబితాను విడుదల చేశారు.

ఈ జాబితాలో మొదటి స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఉండగా రెండవ స్థానంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా నిలిచారు. మూడవ స్థానంలో ప్రభాస్, నాలుగవ స్థానంలో అల్లు అర్జున్ నిలబడ్డారు. ఇక ఈ పాన్ ఇండియా స్టార్స్ సర్వేలో భాగంగా ఐదవ స్థానంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నిలిచారు.

ఆరవ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఉండగా, ఏడవ స్థానంలో కన్నడ నటుడు యశ్,8వ స్థానంలో రామ్ చరణ్ 9వ స్థానంలో సూర్య పదవ స్థానంలో మహేష్ బాబు నిలిచారు. ఇక పాన్ ఇండియా స్టార్ హీరోల జాబితాలో టాప్ టెన్ హీరోలలో భాగంగా బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కేవలం అక్షయ్ కుమార్ మాత్రమే ఐదవ స్థానంలో నిలిచారు. ఇక ఈ సర్వేలో టాప్ టెన్ లో ఉన్నటువంటి మిగతా వారందరూ కూడా సౌత్ ఇండస్ట్రీకి చెందిన వారు కావడం గమనార్హం.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus