2020 సంవత్సరంలో కఠిన లాక్ డౌన్ నిబంధనలు అమలు కావడంతో గతేడాది అభిమానులు ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరిపించాలని భావించినా సాధ్యం కాలేదనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా కరోనా సెకండ్ వేవ్ వల్ల ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు నిరాశ తప్పడం లేదు. అరవింద సమేత సినిమా తరువాత బిగ్ స్క్రీన్ పై కనిపించని తారక్ ఆర్ఆర్ఆర్ సినిమాకే పూర్తిగా పరిమితయ్యారు. షూటింగ్ లు మొదలైన తరువాత ఎన్టీఆర్ రెండు నెలలు ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.
జూన్ నెల నుంచి ఆర్ఆర్ఆర్ షూటింగ్ మొదలైతే మాత్రం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెల నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకుంటున్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది బర్త్ డే సెలబ్రేషన్స్ సమయంలో అభిమానులు కరోనా బారిన పడే అవకాశాలు అయితే ఉన్నాయి.
అందువల్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు కీలక సూచనలు చేయనున్నారని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజుకు సర్ ప్రైజ్ లు మాత్రం ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి పోస్టర్ తో పాటు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ హోస్ట్ చేయబోతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకు సంబంధించి అప్ డేట్ కూడా రానుందని సమాచారం.