Jr NTR: ఫ్యాన్ కోరిక తీర్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ (Jr NTR) ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర (Devara) సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచాయి. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు తారక్ అభిమనులు. అయితే ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీబిజీగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.

ఓటు హక్కును వినియోగించుకున్నాడు. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ఓటు వేసి అక్కడ నుంచి వెళ్తున్న క్రమంలో ఒక అభిమాని అన్నా ఆటోగ్రాఫ్ ఇవ్వాలని అడిగాడు.. వెంటనే ఎన్టీఆర్ అతని గుండెల పై ఆటోగ్రాఫ్ ఇచ్చాడు. ఆ సమయంలో అక్కడున్న మీడియాలో ఈ దృశ్యం రికార్డు అయ్యింది.

ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో ఆయన ఫ్యాన్స్ ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా తారక్ ఎన్నికలు జరిగిన ప్రతిసారి కూడా ఈ విధంగా ఎన్ని పనులు ఉన్నా కూడా తప్పకుండా వచ్చు తన ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉంటారు. తాజాగా కూడా ఉదయాన్నే తన ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కును వినియోగించుకోవడంతో అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus