Jr NTR: ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి హాజర్ కానీ ఎన్టీఆర్ ..కారణం అదేనా..!

యుగ పురుషుడు సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన ముఖచిత్రంతో 100 రూపాయల నాణెంను రిజర్వ్ బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ కాయిన్‍ను ఆగస్ట్ 28న రాష్ట్రపతి భవన్‍లో విడుదల చేస్తామని ఇదివరకే కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని రాష్ట్రపతి కల్చరల్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా సీనియర్ ఎన్టీఆర్ జ్ఞాపకార్థం ప్రత్యేక నాణెంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేశారు. తారక రామారావు 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి నందమూరి కుటుంబీకులు అంతా తరలి వచ్చారు.

ఎన్టీఆర్ (Jr NTR) కుమారులు బాలకృష్ణ, జయకృష్ణతోపాటు పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడు హాజరు అయ్యారు. అయితే ఈ కార్యక్రమానికి హరికృష్ణ కుమారులు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌కు కూడా ఆహ్వానం అందినట్లుగా వార్తలు వచ్చాయి. కానీ ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల కార్యక్రమానికి తారక్, కల్యాణ్ రామ్ మాత్రం హాజరు కాలేదు. ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం లాంచ్ ఈవెంట్‍కు తారక్ రాకపోవడానికి గల కారణం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

దీనిపై ఎంతో మంది ఎన్నో విధాలుగా చర్చిస్తున్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దేవర షూటింగ్‍లో బిజీగా ఉండటం వల్లే రాలేకపోయాడని సమాచారం. తారక్ వస్తే బాబాయ్ బాలకృష్ణతో కలిసి అబ్బాయిని చూసే అవకాశం ఉండేదని అభిమానులు కోరుకున్నారు. కానీ, ఎప్పటిలానే తారక్ హ్యాండ్ ఇవ్వడంతో ఫ్యాన్స్ నిరాశచెందారు. ఇదిలా ఉంటే సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నిర్వహించే ఏ కార్యక్రమానికి హాజరు కావట్లేదన్న విషయం తెలిసిందే.

దీనిపై ఇప్పటికే అనేక ఊహగానాలు, రూమర్స్ తెరపైకి వచ్చాయి. బాలయ్యకు, తారక్‍కు మనస్పర్థలు వచ్చినట్లు, ఎన్టీఆర్‍ను బాలకృష్ణ పక్కకు పెడుతున్నట్లుగా పలు వార్తలు వైరల్ అయ్యాయి.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus