బావ అంటూ బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పిన తారక్!

  • April 9, 2023 / 06:34 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఏప్రిల్ 8వ తేదీ తన 41 పుట్టిన రోజు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఇలా పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఈయనకు శుభాకాంక్షలు వెల్లు వెత్తాయి.సినీ సెలబ్రిటీలతోపాటు అభిమానులు కూడా అల్లు అర్జున్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఎన్టీఆర్ కాస్త ఆలస్యంగా విష్ చేసిన ఎంతో విభిన్నంగా తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ అల్లు అర్జున్ మధ్య జరిగినటువంటి సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… హ్యాపీ బ‌ర్త్ డే బావా అల్లు అర్జున్ అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు.ఎన్టీఆర్ చేసిన ట్వీట్‌కు థాంక్యూ యువ‌ర్ లౌల్లీ విషెష్ బావా… వార్మ్ హ‌గ్స్ అంటూ ప్రేమగా రిప్లై ఇచ్చాడు. ఈ విధంగా బన్నీ రిప్లై ఇవ్వడంతో వెంటనే ఎన్టీఆర్ ఓన్లీ హగ్సేనా…. పార్టీ లేదా పుష్ప అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ తో పాటు.. న‌వ్వుతున్న ఎమోజీని పోస్ట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఇద్దరు స్టార్ హీరోల మధ్య జరిగిన ట్విట్టర్ చాట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఇలా ఇద్దరు హీరోలు బావ బావ అంటూ చాటింగ్ చేసుకోవడంతో ఇద్దరు హీరోల అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ బంధువులు కాకపోయినా ఇండస్ట్రీలో ఎంతో మంచి స్నేహితులుగా ఇలా బంధం కలుపుకుంటూ సరదాగా మాట్లాడటం చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉండగా ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వీరి సినిమా షూటింగ్ పనులతో బిజీగా గడుపుతున్నారు.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus