Jr NTR: మాల్ లో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్.. ఫోటో వైరల్..!

  • June 3, 2022 / 06:25 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం కొరటాల శివ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అతని నుండీ వచ్చిన లేటెస్ట్ మూవీ ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసి… రూ.1150 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ ను సాధించింది. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాంచరణ్ మరో హీరోగా నటించగా ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించారు.ప్రస్తుతం తారక్ వెకేషన్‌లో ఉన్నాడు.

‘ఎన్టీఆర్‌ 30’ జూలై నుండీ సెట్స్ పైకి వెళ్ళనుంది. అప్పటివరకు గ్యాప్ ఉండడంతో తారక్‌ సింగపూర్‌ కు వెకేషన్ రీత్యా వెళ్లినట్టు స్పష్టమవుతుంది.ఇక సింగ‌పూర్‌లోని టీఎస్ఎంబీఎస్ మాల్‌లో ఎన్టీఆర్‌ సందడి చేశాడు. అక్కడ ఉన్న ఎన్టీఆర్ అభిమానులు ఫోటోల కోసం రిక్వెస్ట్ చేయగా వారికి సంతోషంగా ఫోటో ఛాన్స్ ఇచ్చాడు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాకపోతే ఈ ఫొటోల్లో తారక్‌ భార్య ప్రణతి కానీ, తన పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కానీ కనిపించలేదు.

‘వాళ్ళని ఏ హోటల్లోనో పెట్టి ఎన్టీఆర్ మాత్రమే బయటకు వచ్చి ఇలా మాల్ లో సందడి చేశాడా?’ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ ఛాన్స్ దొరికిన ప్రతీసారి తన భార్య, పిల్లలతో కలిసి వెకేషన్ కు వెళ్తుంటాడు. వాళ్ళు లేకుండా అతను వెకేషన్ కు వెళ్ళేది తక్కువ. అంతేకాకుండా వెకేషన్ కు వెళ్లిన ప్రతీసారి ఎన్టీఆర్ భారీ లెవెల్లో షాపింగ్ చేస్తుంటాడని అతని సన్నిహితులు కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

 

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus