Jr NTR: మరోసారి జూ.ఎన్టీఆర్ పై విమర్శలు.. కారణం?

జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ అనే సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. గతంలో ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. అలాగే ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కూడా ఇదే..! అలాగే హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది. విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు. కాబట్టి ‘దేవర’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా..

ఈ సినిమా షూటింగ్ కు కొంత గ్యాప్ ఇచ్చి (Jr NTR) ఎన్టీఆర్.. ఇప్పుడు దుబాయ్ వెళ్ళాడు. సైమా అవార్డు వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్ కి అవార్డు లభించడంతో ఎన్టీఆర్ దుబాయ్ వెళ్లినట్టు స్పష్టమవుతుంది. అందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ‘బిగ్ బాస్ 3 ‘ కంటెస్టెంట్ హిమజ .. ఎన్టీఆర్ తో తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు.

దీంతో నందమూరి, నారా కుటుంబ సభ్యులు … ఆందోళనలో ఉన్నారు. టీడీపీ శ్రేణుల్లో కూడా చాలా టెన్షన్ ఉంది. బాలకృష్ణ కూడా షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చినట్టు టాక్ నడుస్తుంది. ఇలాంటి టైంలో ఎన్టీఆర్.. సైమా అవార్డుల కోసం దుబాయ్ వెళ్లడంపై కొందరు నందమూరి అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. పోనీ ఎన్టీఆర్ దుబాయ్ నుండి వచ్చిన తర్వాతైనా చంద్రబాబుని పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అనే డిస్కషన్లు ఊపందుకున్నాయి.

Goldie Nissy, Nithya Sree & Karthik Rathnam Exclusive Interview | Changure Bangaru Raja, Ravi Teja

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus